Whatsapp Contacts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై వెబ్, విండోస్ యాప్‌లో నేరుగా కాంటాక్టులను యాడ్ చేయొచ్చు..!
Whatsapp Contacts : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వాట్సాప్ వెబ్ నుంచి కాంటాక్టులను చాలా సులభంగా యాడ్ చేయొచ్చు. పూర్తి వివరాలివే..

WhatsApp now lets users add and manage contacts
Whatsapp Contacts : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆసక్తిగల వినియోగదారులు తమ కాంటాక్టులను చాలా ఈజీగా యాడ్ చేయొచ్చు. మల్టీ డివైజ్‌ల్లో ఈ ప్రక్రియను మరింత సులభంగా పూర్తి చేయొచ్చు. ఇప్పటివరకు, వాట్సాప్ కాంటాక్టులను యాడ్ చేయడం అనేది ఫోన్ నంబర్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సి వచ్చేది.
అదేవిధంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా మాత్రమే కాంటాక్టులను యాడ్ చేయగలరు. కానీ, ఈ కొత్త అప్‌డేట్‌తో వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్ వెబ్, విండోస్ యాప్ నుంచి కాంటాక్టులను యాడ్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ భవిష్యత్తులో ప్రైమరీ డివైజ్ కాకుండా ఇతర లింక్ చేసిన డివైజ్‌లలో కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
వెబ్ లేదా విండోస్ యాప్‌కు సపోర్టు :
మీ కంప్యూటర్ నుంచి నేరుగా కాంటాక్టులను యాడ్ చేయొచ్చు. వాట్సాప్ వెబ్‌లో ఉన్నా లేదా విండోస్ యాప్‌ని ఉపయోగిస్తున్నా మీరు ఇప్పుడు మీ ఫోన్‌కి మారకుండానే కాంటాక్టులను మీ కీబోర్డ్ సాయంతో యాడ్ చేయొచ్చు. మల్టీ డివైజ్‌ల్లో వాట్సాప్ ఉపయోగించే లేదా బిజినెస్ లేదా పర్సనల్ మెసేజ్‌ల కోసం కంప్యూటర్‌లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
వాట్సాప్‌లో ప్రత్యేకంగా కాంటాక్ట్‌లను సేవ్ చేసుకునేందుకు కొత్త ఆప్షన్ తీసుకొస్తోంది. నిర్దిష్ట కాంటాక్ట్‌లను మీ ఫోన్ అడ్రస్ బుక్‌లో సేవ్ చేయకుండా నేరుగా వాట్సాప్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ తమ ఫోన్‌లను ఇతరులతో షేర్ చేసుకునేందుకు సాయపడుతుంది.
వినియోగదారులకు లేదా ఒకే డివైజ్‌లో మల్టీ వాట్సాప్ అకౌంట్లను నిర్వహించే వారికి బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ అప్‌డేట్‌లో మరో ప్రయోజనం ఏంటంటే.. మీరు ఎప్పుడైనా మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా డివైజ్ ఎక్స్ఛేంజ్ చేసినా వాట్సాప్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్‌లు రీస్టోర్ అవుతాయి.
ఈ బ్యాకప్ సిస్టమ్ సెక్యూరిటీ యూజర్ల ప్రైవసీని అందిస్తుంది. డివైజ్ ఏదైనా ప్రమాదంలో దెబ్బతింటే.. వినియోగదారులు తమ కాంటక్టులను కోల్పోకుండా ఉంటారు. భవిష్యత్తులో వాట్సాప్ యూజర్‌నేమ్‌ల ద్వారా కాంటాక్టులను సేవ్ చేసే ఫీచర్ తీసుకురానుంది. కమ్యూనికేట్ చేసేందుకు వినియోగదారులు ఇకపై వారి ఫోన్ నంబర్‌లను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు.