Debit Card Insurance : ఫోన్‌లో ఈజీగా ఉందని రప్పా రప్పా పేమెంట్స్ చేసేస్తున్నారా?.. మీ డెబిట్ కార్డ్ కూడా వాడండి.. ఇన్ని లక్షల బెనిఫిట్స్ వస్తాయ్..!

Debit Card Insurance : మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డుకు బీమా కవరేజ్ ఉంటుందని తెలుసా? డెబిట్ కార్డ్ బీమా, అర్హత ప్రమాణాలు, ఎలా క్లెయిమ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

offering insurance for debit card holders

Debit Card Insurance : డిజిటల్ పేమెంట్స్ యాప్ పుణ్యామని ఇప్పుడు ప్రతిఒక్కరూ తమ ఫోన్లలోనే తెగ పేమెంట్లు చేసేస్తున్నారు. కిరాణ సరుకుల దగ్గర నుంచి క్రెడిట్ కార్డు బిల్లుల పేమెంట్ల వరకు అన్ని ఫోన్లలోనే పేమెంట్ చేస్తున్నారు. అసలు డెబిట్ కార్డు వాడకమే చాలావరకూ తగ్గిపోతుంది. ఎప్పుడైనా అర్జెంటుగా క్యాష్ అవసరమైతే ఏటీఎంలకు పోవడమే తప్పా.. డెబిట్ కార్డుతో పేమెంట్స్ చేయడం పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చెప్పాలి.

అదే క్రెడిట్ కార్డు అయితే తెగ గీకేస్తుంటారు. డెబిట్ కార్డు వాడకంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు. ఒకసారి డెబిట్ కార్డుతో కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే ఇకపై ఇదే వాడేస్తామంటారు. ఈ డెబిట్ కార్డులతో లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. అందులో ముఖ్యంగా డెబిట్ కార్డు ద్వారా ఆరోగ్య బీమాను పొందవచ్చు. ఇంతకీ ఏయే బ్యాంకులు తమ డెబిట్ కార్డులతో హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి? ఎలా బీమాను పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Gold Rates Today : పసిడి పైపైకి.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. లక్ష దాటేవరకు తగ్గదా ఏంటి?

డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ :
మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డుకు బీమా కవరేజ్ ఉంటుందని మీకు తెలుసా? దురదృష్టవశాత్తు కార్డుదారుడు మరణించిన సందర్భంలో ఈ మొత్తాన్ని సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ బీమా, అర్హత ప్రమాణాలు, ఎలా క్లెయిమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్ ఏమిటి? :
అన్ని బ్యాంకు అకౌంట్లు తమ ఖాతాదారులకు ఏటీఎం-కమ్-డెబిట్ కార్డులను అందిస్తాయి. డబ్బును విత్‌డ్రా చేసేటప్పుడు మర్చంట్లతో ప్రత్యక్ష లావాదేవీలు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. దురదృష్టవశాత్తు కార్డుదారుడి మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు ఈ డబ్బు మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

కానీ, బీమాకు అర్హత పొందేందుకు కొన్ని ముందస్తు విషయాలను తెలుసుకోవాలి. మీ బ్యాంక్, డెబిట్ కార్డ్ టైప్ బట్టి మారుతుంది. అలాగే, ఈ బీమాకు పాలసీ నంబర్ లేదు. మొత్తాన్ని క్లెయిమ్ చేయడంలో గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. భారత్‌లోని 5 ప్రధాన బ్యాంకులు అందించే ఏటీఎం కార్డ్ బీమా రకాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డెబిట్ కార్డులపై ఈ బ్యాంకులు బీమా అందిస్తున్నాయా? :
SBI, HDFC, ICICI, Axis, Kotak Mahindra వంటి బ్యాంకులు కార్డుదారులకు ఉచిత బీమా కవరేజీని అందిస్తాయి.

ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ :
ఎస్బీఐ బ్యాంకు ప్రమాదవశాత్తు మరణానికి బీమా కవరేజీని అందిస్తుంది. ఎస్బీఐ డెబిట్ కార్డులు అందించే మరణ కవరేజ్ వివరాలు ఇలా ఉన్నాయి. అర్హత పొందాలంటే, ప్రమాదం జరిగిన 90 రోజుల ముందు కార్డ్ హోల్డర్ ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో లావాదేవీ కోసం డెబిట్ కార్డును ఉపయోగించాలి. అదనంగా, ఎయిర్ డెత్ కవరేజ్‌కు అర్హత పొందడానికి, టికెట్‌ను అదే డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసి ఉండాలి. కవరేజ్ ఆధారంగా మొత్తం కవరేజీ వివరాలు ఇలా ఉంటాయి.

కార్డ్ టైప్ బీమా కవరేజ్ (ఎయిర్ ) బీమా కవరేజ్ (నాన్-ఎయిర్)

ఎస్బీఐ గోల్డ్ (మాస్టర్ కార్డ్/వీసా)

రూ.2 లక్షలు

రూ.4 లక్షలు

ఎస్బీఐ ప్లాటినం (మాస్టర్ కార్డ్/వీసా)

రూ.5 లక్షలు

రూ.10 లక్షలు

ఎస్బీఐ ప్రైడ్ (బిజినెస్ డెబిట్) మాస్టర్ కార్డ్/వీసా)

రూ.2 లక్షలు

రూ.4 లక్షలు

ఎస్బీఐ ప్రీమియం (బిజినెస్ డెబిట్) మాస్టర్ కార్డ్/వీసా)

రూ.5 లక్షలు

రూ.10 లక్షలు

ఎస్బీఐ వీసా సిగ్నేచర్/మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్

రూ.10 లక్షలు

రూ.20 లక్షలు

SBI గోల్డ్ (మాస్టర్ కార్డ్/వీసా) : బీమ కవరేజీ (ఎయిర్) మొత్తం రూ.2 లక్షలు అయితే, బీమా కవరేజ్ (నాన్-ఎయిర్) రూ. 4 లక్షలు

ఎస్బీఐ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ రూ.2 లక్షలు మరణం లేదా శాశ్వత వైకల్య కవరేజీని అందిస్తుంది. దీనికి అర్హత పొందాలంటే, ప్రమాదం జరిగిన తేదీకి 30 రోజుల ముందు ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఇ-కామర్స్ వద్ద కనీసం ఒక రూపే కార్డ్ లావాదేవీని పూర్తి చేసి ఉండాలి.

ఎస్బీఐ డెబిట్ కార్డ్ పర్‌సేజ్ ప్రొటెక్షన్ :
దొంగతనం లేదా దోపిడీ కారణంగా కొనుగోలు చేసిన వస్తువులు లేదా వస్తువుల నష్టాన్ని కవర్ చేసేందుు ఈ ప్రొటెక్షన్ కవరేజీని ఎస్బీఐ కూడా అందిస్తుంది. దీనికి అర్హత పొందాలంటే, కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు దొంగతనం జరగాలి.

మీరు ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్‌లో అర్హత కలిగిన డెబిట్ కార్డ్ వేరియంట్‌లను ఉపయోగించి వస్తువును కొనుగోలు చేయాలి. మీ కార్డ్ రకాన్ని బట్టి మీరు రూ.5వేల నుంచి రూ.1 లక్ష వరకు కవరేజ్ పొందవచ్చు. రూ. 2 లక్షల జీతం ప్యాకేజీ ఖాతాదారులకు (అన్ని మాస్టర్ కార్డ్/వీసా టైప్) జారీ చేసిన కార్డులకు ఎస్బీఐ పర్ సేజ్ ప్రొటెక్షన కవర్‌ను కూడా అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్ :
HDFC బ్యాంక్ కార్డుదారులకు ప్రమాదవశాత్తు మరణ కవరేజీని అందిస్తుంది. కార్డు రకాన్ని బట్టి మొత్తాలు మారుతూ ఉంటాయి. బ్యాంకు ఆధారంగా మొత్తాలు, ప్రమాణాలు మారవచ్చని గమనించాలి. ఈ మొత్తం గత 12 నెలల ఖర్చు ఆధారిత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

కార్డ్ టైప్ ఉచిత యాక్సిడెంటల్ బేస్ కవర్ (రైలు, రోడ్డు లేదా ఎయిర్‌లైన్ ) యాక్సిలరేటెడ్ ఇన్సూరెన్స్ కవర్ (ఎయిర్‌లైన్/రైల్/రోడ్డు) ప్రమాద విమాన బీమా కవర్ (అంతర్జాతీయ ప్రయాణం)

ప్లాటినం డెబిట్ కార్డ్

రూ.5 లక్షలు

బేస్ కవర్ + యాక్సిలరేటెడ్ కవర్ రూ.5 లక్షల వరకు

రూ.3 కోట్లు

జెట్ ప్రివిలేజ్ HDFC బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్

రూ.5 లక్షలు

బేస్ కవర్ + యాక్సిలరేటెడ్ కవర్ రూ.20 లక్షల వరకు

రూ.1 కోటి

టైమ్స్ పాయింట్స్ డెబిట్ కార్డ్ / మిలీనియా డెబిట్ కార్డ్ / రూపే ప్రీమియం

రూ.5 లక్షలు

బేస్ కవర్ + యాక్సిలరేటెడ్ కవర్ రూ.5 లక్షల వరకు

రూ.1 కోటి

బిజినెస్ డెబిట్ కార్డ్

రూ.5 లక్షలు

బేస్ కవర్ + యాక్సిలరేటెడ్ కవర్ రూ.5 లక్షల వరకు

రూ.1 కోటి

రివార్డ్స్ డెబిట్ కార్డ్ / గోల్డ్ డెబిట్ కార్డ్ / ఉమెన్ డెబిట్ కార్డ్

రూ.5 లక్షలు

వర్తించదు

రూ.25 కోట్లు

బీమా కవరేజ్ ఇతర ప్రమాణాలివే :
ఉచిత యాక్సిడెంటల్ బేస్ కవరేజ్ పొందాలంటే.. కార్డుదారులు గత 30 రోజుల్లో పాయింట్ ఆఫ్ సేల్‌లో ఒక షాపింగ్ లావాదేవీని పూర్తి చేసి ఉండాలి. అంతర్జాతీయ ప్రయాణంలో ప్రమాద విమాన బీమా కవరేజ్ కోసం టికెట్‌ను అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసి ఉండాలి.

ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ :
ఐసీఐసీఐ బ్యాంక్ ఈ కింది మొత్తాలను బీమా కవరేజ్‌గా అందిస్తుంది. బ్యాంకు ఆధారంగా మొత్తాలు, ప్రమాణాలు మారవచ్చని గమనించండి.

అకౌంట్ టైప్ వ్యక్తిగత ప్రమాద మరణ బీమా (నాన్-ఎయిర్) వ్యక్తిగత ప్రమాద మరణ బీమా (ఎయిర్)

రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్

 వర్తించదు

రూ.50 వేలు

సిల్వర్ సేవింగ్స్ అకౌంట్

 వర్తించదు

రూ.50 వేలు

గోల్డ్ సేవింగ్స్ అకౌంట్

రూ.5 లక్షలు

రూ.30 లక్షలు

టైటానియం సేవింగ్స్ అకౌంట్

రూ.10 లక్షలు

రూ.40 లక్షలు

వెల్త్ సేవింగ్స్ అకౌంట్

రూ.12 లక్షలు

రూ.1 కోటి

వెల్త్ సెలెక్ట్ సేవింగ్స్ అకౌంట్

రూ.14 లక్షలు

రూ.2 కోట్లు

డెబిట్ కార్డ్ బీమా నిబంధనలు, షరతులు :
యాక్టివ్ అకౌంట్లు మాత్రమే వ్యక్తిగత, విమాన ప్రమాద కవర్‌ను క్లెయిమ్ చేయగలవు.
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు (BSBDA) బీమా కవర్ వర్తించదు.
కార్డుదారుడు దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలోనే వ్యక్తిగత ప్రమాద మరణ బీమా, విమాన ప్రమాద మరణ బీమా వర్తిస్తాయి.

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్ :

  • యాక్సిస్ బ్యాంక్ బీమా కవర్ ఎంపిక చేసిన కార్డులపై అందుబాటులో ఉంది. కార్డుదారుడి అర్హతను బ్యాంక్ నిర్ణయిస్తుంది. అయితే, కొన్ని సాధారణ నిబంధనలు, షరతులు ఇలా ఉంటాయి.
  • రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ మినహా అన్ని డెబిట్ కార్డులకు వ్యక్తిగత ప్రమాద బీమా కవర్లకు అర్హత పొందాలంటే.. క్లెయిమ్ దాఖలు చేసిన ప్రమాదం జరిగిన తేదీకి 180 రోజుల ముందు కార్డును కొనుగోలు చేసి ఉపయోగించాలి.
  • వ్యక్తిగత ప్రమాద బీమా కవర్‌కు అర్హత పొందాలంటే ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజులలోపు యాక్సిస్ బ్యాంక్‌కు నివేదిక సమర్పించాలి.

రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ : ప్రమాదం జరిగిన తేదీకి 45 రోజుల ముందు ఏటీఎం, మైక్రో ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్స్, ఇ-కామర్స్ లేదా ఏదైనా పేమెండ్ ద్వారా మర్చంట్ కరస్పాండెన్స్‌లో కనీసం ఒక ఆర్థిక లావాదేవీ లేదా ఆర్థికేతర లావాదేవీ చేయాలి.

  • ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్‌కు అర్హత పొందాలంటే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి విమాన టికెట్ కొనుగోలు చేయాలి.
  • విమాన ప్రమాద బీమా కవర్ వాణిజ్య విమానాల ద్వారా ప్రయాణించేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ కవర్ పైలట్, సిబ్బంది సభ్యులకు వర్తించదు.
  • విమాన ప్రమాదం జరిగితే, విమాన ప్రమాద బీమా కవర్ మాత్రమే వర్తిస్తుంది. ఇతర వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ వర్తించదు.
  • ఒక కస్టమర్ అనేక డెబిట్ కార్డులను కలిగి ఉంటే.. అందులో ఒకదానికి మాత్రమే బీమా కవరేజ్ వర్తిస్తుంది. అత్యధిక బీమా కవర్ ఉన్న యాక్టివ్ డెబిట్ కార్డుగా పరిగణిస్తారు.
  • లాస్ట్ కార్డ్ లయబిలిటీ, పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్‌కు అర్హత పొందాలంటే సంఘటన జరిగిన 90 రోజుల ముందు కనీసం ఒక లావాదేవీని పూర్తి చేయాలి.
  • కొనుగోలు రక్షణ కవర్‌లో డెబిట్ కార్డు ద్వారా జరిగే అన్ని అనధికార లావాదేవీల నుంచి ప్రొటెక్షన్ పొందవచ్చు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్
కోటక్ మహీంద్రా డెబిట్ కార్డులు సురక్షితమైన 6-అంకెల పిన్‌ను ఉపయోగిస్తాయి. ఉచిత బీమా కవరేజీని అందిస్తాయి. ఆయా మొత్తాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బ్యాంకు ఆధారంగా మొత్తాలు, ప్రమాణాలు మారవచ్చని గమనించండి. బీమా కవరేజీకి అర్హత పొందడానికి కొన్ని ప్రమాణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

కార్డ్ టైప్ విమాన ప్రమాదం వ్యక్తిగత ప్రమాద బేస్ కవర్ వ్యక్తిగత ప్రమాద ఎన్‌హాన్స్  కవర్

క్లాసిక్ / మాస్ట్రో కార్డులు

వర్తించదు

రూ.2 లక్షలు

వర్తించదు

గోల్డ్ / టైటానియం కార్డులు

రూ.15 లక్షలు

రూ.5 లక్షలు

రూ.15 లక్షలు

ప్లాటినం / మై వరల్డ్  కార్డులు

రూ.50 లక్షలు

రూ.5 లక్షలు

రూ.15 లక్షలు

బిజినెస్ గోల్డ్ కార్డులు

రూ.20 లక్షలు

రూ.5 లక్షలు

రూ.15 లక్షలు

ప్రివీ ప్లాటినం / వరల్డ్ / వరల్డ్ ఎక్స్‌క్లూజివ్

రూ.50 లక్షలు

రూ.5 లక్షలు

రూ.15 లక్షలు

సిగ్నేచర్  కార్డులు

రూ.1 కోటి

రూ.5 లక్షలు

రూ.15 లక్షలు

ఇన్ఫినైట్ కార్డులు

రూ.5 కోట్లు

రూ.5 లక్షలు

రూ.15 లక్షలు

బిజినెస్ ప్లాటినం

రూ.50 లక్షలు

రూ.5 లక్షలు

రూ.15 లక్షలు

పర్సనల్ బేస్ కవర్‌కు అర్హత పొందడానికి, మీరు గత 30 రోజుల్లో కనీసం 2 పాయింట్ ఆఫ్ సేల్స్ లేదా రూ. 500 విలువైన ఇ-కామర్స్ లావాదేవీలను కలిగి ఉండాలి.
వ్యక్తిగత ప్రమాద మెరుగుదల కవర్‌కు అర్హత పొందాలటే మీరు గత 60 రోజుల్లో కనీసం 6 పాయింట్ ఆఫ్ సేల్ లేదా రూ. 500 విలువైన ఇ-కామర్స్ లావాదేవీలను కలిగి ఉండాలి.

కోటక్ మహీంద్రా ఇతర బీమా కవరేజీలు :

  • కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులు కూడా కార్డ్ లయబెలిటిని కోల్పోయాయి. పర్‌సేజ్ ప్రొటెక్షన్ పొందాయి. బ్యాగేజీని కోల్పోయిన క్లెయిమ్‌లను పొందాయి. ఆయా మొత్తాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
  • కార్డు టైప్ బట్టి కోల్పోయిన కార్డు లయబెలిటీ కవరేజ్ రూ.2.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటుంది.
  • అన్ని రకాల కార్డులకు రూ.1 లక్ష లాస్ట్ బ్యాగేజ్ కవరేజ్
  • పర్‌సేజ్ ప్రొటెక్షన్ అనేది అగ్నిప్రమాదం, దోపిడీని కవర్ చేస్తుంది. కార్డు టైప్ బట్టి రూ. 50వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు అందిస్తుంది.

మరణం తర్వాత ఏటీఎం కార్డ్ బీమాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? :
బీమా కవరేజ్ క్లెయిమ్ చేసే నిర్దిష్ట ప్రక్రియ మీ బ్యాంకును బట్టి మారవచ్చు. సాధారణంగా, మీరు సంఘటన గురించి వీలైనంత త్వరగా బ్యాంకుకు తెలియజేయాలి. అవసరమైన పత్రాలను సమర్పించాలి.

కొన్ని బ్యాంకులకు డెబిట్ కార్డ్ బీమా క్లెయిమ్‌ల ప్రక్రియ :

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ అయితే, దురదృష్టవశాత్తు కార్డుదారుడు మరణించిన సందర్భంలో 15 రోజుల్లోపు 1800 2666 నంబర్‌కు ఐసీఐసీఐ లాంబార్డ్ కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు బీమా కవరేజీని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే, మీరు 1800 2666 5844 నంబర్‌కు కాల్ చేయవచ్చు.

పాలసీ నంబర్ 4112-400401-23-7001805-00-000, దీనిని బీమా కంపెనీని సంప్రదించేటప్పుడు పేర్కొనాలి. ప్రమాదం జరిగిన 90 రోజుల్లోపు క్లెయిమ్ ప్రారంభించబడాలి. మీరు యాక్సిస్ బ్యాంక్ లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్ అయితే, అవసరమైన పత్రాలతో సమీపంలోని బ్యాంక్ శాఖను సందర్శించాలి.

డెబిట్ కార్డ్‌పై ప్రమాద బీమాను ఎలా క్లెయిమ్ చేయాలి? :

  • కార్డుదారుడు మరణించిన తర్వాత బీమాను క్లెయిమ్ చేసేందుకు సాధారణంగా, ఈ కింది డాక్యుమెంట్లు అవసరం
  • పూర్తి చేసిన క్లెయిమ్ ఫారం ఒకటి.
  • నామినీ పూర్తి చేసి సంతకం చేసిన ఒరిజినల్ పర్సనల్ యాక్సిడెంట్ డెత్ (PA) క్లెయిమ్ ఫారమ్
  • మరణ ధృవీకరణ పత్రం కాపీ : నోటరీ /గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ
  • ఎఫ్ఐఆర్ కాపీ/పంచనామా కాపీ : గెజిటెడ్ అధికారి నోటరీ/ధృవీకరణ
  • పోస్ట్ మార్టం నివేదిక కాపీ – నోటరీ /గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ

ఇతర చట్టపరమైన వారసుల నుంచి రూ. 50/100 స్టాంప్ పేపర్‌పై సమ్మతి లేఖ (ఇతర చట్టపరమైన వారసుల నుంచి అభ్యంతర ధృవీకరణ పత్రం లేదు). ఒరిజినల్ (అకౌంట్లో నామినీ లేకుంటే)

Read Also : PM Kisan 19th installment : పీఎం కిసాన్ 19వ విడతపై ఉత్కంఠ.. రైతులు ఈ పనిచేయకుంటే అకౌంట్లలో డబ్బులు పడవు.. ఫుల్ డిటెయిల్స్..!

  • పేరుతో నామినీ, క్యాన్సిల్డ్ చెక్కు, ఒరిజినల్ (డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్)
  • కార్డుదారుడు ఆస్పత్రిలో మరణిస్తే.. ఆస్పత్రిలో చేరిన డాక్యుమెంట్లు
  • ప్రమాదం గురించి లోకల్ మీడియాకు రిపోర్టు చేస్తే.. కొన్ని బ్యాంకులు మీరు వార్తాపత్రిక కటింగ్‌లను సమర్పించవలసి ఉంటుంది.
  • క్యాన్సిల్డ్ చెక్కు కాపీతో సపోర్టుగా (NEFT) ద్వారా పేమెంట్ చేసేందుకు మాండేట్ ఫారమ్ ఉండాలి.

కార్డు కాపీతో పాటు కార్డు వివరాలు :
విమాన ప్రమాదం వల్ల మరణం సంభవిస్తే.. విమాన టికెట్, విమాన సంస్థ నుంచి ధృవీకరణ పత్రం, విమాన ప్రమాద బీమా కవర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ విషయంలో, క్లెయిమ్ దాఖలు చేసే డెబిట్ కార్డ్ ద్వారా కార్డ్ హోల్డర్ కొనుగోలు చేసిన విమాన టికెట్ రుజువు తప్పక కలిగి ఉండాలి.