Gold Rates Today : పసిడి పైపైకి.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. లక్ష దాటేవరకు తగ్గదా ఏంటి?
Gold Rates Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 14న బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే వెండీ లక్ష దాటేసింది. బంగారం ధరలు కూడా లక్ష దాటేవరకు తగ్గేలా కనిపించడం లేదు.

Gold And Silver Price On 14th February 2025
Gold Rates Today : పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గేదేలా అంటున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు (ఫిబ్రవరి 14) శుక్రవారం ఉదయం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పసిడి ధర ఒక మోస్తరుగా పెరిగింది.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,160గా ఉండగా, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 79,900గా ఉంది. ఈరోజు ఉదయం వెండి ధర ఒక్కసారిగా పెరిగి రూ.1000 వద్ద లాభపడింది. ముంబైలో వెండి కిలోకు రూ.1,00,500 వద్ద ట్రేడవుతోంది.
Read Also : మీకు జీతం తక్కువగా వస్తుందా? ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. లైఫ్ మొత్తం హ్యాపీగా బతికేయొచ్చు..!
స్వచ్ఛతకు ప్రసిద్ధి చెందిన 24-క్యారెట్ల బంగారం, ప్రీమియం నాణ్యత కోరుకునే కొనుగోలుదారులను ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంది. అదే సమయంలో బంగారం మన్నికకు విలువైన 22-క్యారెట్ల బంగారం కూడా ఆభరణాల ప్రియులు, పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర ఉదయం దాదాపు 1.14 శాతం పెరిగింది. వెండి 1 కిలోకు రూ.96,321 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర 10 గ్రాములకు స్వల్పంగా పెరిగి రూ.86,121.00 వద్ద ట్రేడవుతోంది.
నగరాల వారీగా బంగారం, వెండి ధరలు ఇలా :
మరోవైపు, ప్రధాన భారతీయ నగరాల్లో స్పాట్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు రూ. 1000 పెరిగి కిలోకు రూ. లక్ష దాటాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం రేట్లు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,050గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,310గా ఉంది.
కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,900 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,160గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళ, చెన్నై, అహ్మదాబాద్, పాట్నాలో కూడా ఇదే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలివే :
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,160 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,160 వద్ద ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,160 వద్ద ఉంది.
Read Also : జీతం చాలట్లేదు.. అప్పులు క్లియర్ చేసేద్దాం అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ మిస్టేక్స్ చేయొద్దు..
వెండి ధరలు ఇలా :
మరోవైపు, ప్రధాన భారతీయ నగరాల్లో స్పాట్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు రూ. 1000 పెరిగి కిలోకు రూ. లక్ష చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 1,08,000కు చేరుకుంది. అలాగే, విజయవాడ, విశాఖపట్నంలో వెండి ధరలు కూడా ఇలానే కొనసాగుతున్నాయి.