బంగారు ఆభరణాలు కొంటే లాభమా? పసిడి బాండ్లు కొంటేనా?

GOLD: గోల్డ్ బాండ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. దాని బదులు బంగారం కొంటేనే లాభాలుంటాయా?

బంగారు ఆభరణాలు కొంటే లాభమా? పసిడి బాండ్లు కొంటేనా?

పసిడిపై పెట్టుబడులతో ఎన్నో లాభాలు ఉంటుండడంతో దీనిపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పసిడిపై పెట్టుబడులు మూడు రకాలు. ఫిజికల్ గోల్డ్ (ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బార్స్), డిజిటల్ గోల్డ్ (పేటీఎం, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేసేవి), పేపర్ గోల్డ్ (గోల్డ్ బాండ్లు, ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి).

మనం ఆర్థిక సంక్షోభం ఎదుర్కునే పరిస్థితి వస్తే బంగారాన్ని వాడుకుని దాని నుంచి బయటపడొచ్చు. గోల్డ్ బాండ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. దాని బదులు బంగారం కొంటేనే లాభాలుంటాయా? అన్న ప్రశ్నలు వస్తుందటాయి. ఎన్డీఏ సర్కారు 2015 నవంబరులో గోల్డ్ బాండ్‌లు ప్రవేశపెట్టింది.

పసిడిని చాలా మంది ఆభరణాలు, కాయిన్లు రూపాల్లో దాచుకుంటారు. దానికి బదులుగా బాండ్ల రూపంలోనూ పెట్టుబడిగా మార్చుకోవచ్చు. వీటిని బ్యాంకులతో పాటు స్టాక్ మార్కెట్ వెబ్‌ సైట్లలో డబ్బు, చెక్కులు, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి రూపాల్లో కొనవచ్చు. ఒక గోల్డ్ బాండ్స్‌ ద్వారా మనం ఒక గ్రామ్ పసిడిని కొంటే.. 8 ఏళ్ల అనంతరం ఆ బాండ్ విలువకు తగ్గట్లుగా పసిడిని పొందవచ్చు.

సంవత్సరానికి 2.5 శాతం చొప్పున వడ్డీ కూడా దక్కుతుంది. బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టినప్పటికీ కొంత నగుదు చెల్లించాలి. దీంతో గోల్డ్ బాండ్ మరింత సురక్షితంగా భావించవచ్చు. పసిడిని పెట్టుబడిగా భావించే వారి కోసం ఆర్బీఐ కూడా గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చింది.

గోల్డ్ బాండ్లను తీసుకుంటే తరుగు, మజూరీ ఛార్జీల వంటి వాటితో పాటు జీఎస్టీ వంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పసిడి ధర చెల్లిస్తే చాలు. ఇన్‌కమ్ ట్యాక్స్ లో మినహాయింపునూ పొందవచ్చు. వ్యక్తిగత బాండ్ల రూపంలో మనం ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనవచ్చు. ట్రస్టుల వంటి సంస్థలైతే 20 కిలోల వరకు పసిడి కొనవచ్చు.

Read Also: భారత్‌కు ఐక్యూ Z9 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. మార్చి 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?