దేశంలో బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?

Gold: గత ఏడాది నుంచి గోల్డ్‌ రేట్‌ పైపైకి చూస్తోంది. ముఖ్యంగా గత నెలరోజుల్లో గోల్డ్‌ రేట్‌ 8వేల రూపాయలకు పైగా పెరిగింది.

బంగారం మళ్లీ పరుగులు తీస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడం, గ్లోబల్‌ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్‌ పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,350, అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.69,110కు చేరింది.

దేశంలో బంగారం ధరలు పెరిగేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ట్రెడ్‌‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్లో, సెంటిమెంట్‌ ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం బంగారం రేట్లు మారుతుంటాయి. దీంతో పాటు రూపాయి మారకం విలువలో మార్పులు కూడా బంగారంపై ఇంఫాక్ట్‌ చూపుతాయి.

రూపాయి బలపడితే బంగారం ధర దిగిరావడం… రూపాయి బలహీనపడితే బంగారం ధర పెరగడం జరగుతుంది. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు కూడా గోల్డ్‌పై ప్రభావం చూపుతాయి. ఆర్థిక అనిశ్చితి, అధిక డిమాండ్‌ ఉంటే బంగారం ధర అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఈక్విటీ మార్కెట్లు నేలచూపులు చూస్తుంటే… ఇన్వెస్టర్లు సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా గోల్డ్‌ను ఎంచుకుంటారు.

వడ్డీరేట్లను తగ్గిస్తే..
పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తే గోల్డ్‌ రేట్స్‌కు రెక్కలు వస్తుంటాయి. ఇక ప్రభుత్వ పాలసీలు కూడా గోల్డ్‌పై ప్రభావితం చూపుతాయి. గోల్డ్‌ దిగుమతులు, కస్టమ్స్‌ సుంకాలు, ఇతర పన్నులు, ట్రేడింగ్‌ రెగ్యులేషన్స్‌, సప్లయ్‌- డిమాండ్‌ వ్యత్యాసాలు పసిడి రేట్లలో అప్‌ అండ్‌ డౌన్‌కు కారణమవుతాయి. ఇక సీజనల్‌ డిమాండ్‌ కూడా గోల్డ్‌పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఫెస్టివల్‌, పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్‌కు అధిక డిమాండ్ ఉంటుంది. దీంతో బంగారం ధర ఈ సమయంలో అంతకంతకూ పెరుగుతుంది.

గత 3 దశాబ్దాల నుంచి ర్యాలీని గమనిస్తే గోల్డ్‌లో సడన్‌ స్పైక్‌ కనిపిస్తోంది. నైన్‌టీస్‌లో గోల్డ్‌ రేట్స్‌ స్టడీగా ఉన్నప్పటికీ… ఓ దశలో 20శాతం పెరిగిన రేట్స్‌… అంతే స్థాయిలో పతనమయ్యాయి. ఇక 2000 నుంచి 2010 సంవత్సరాల మధ్య గోల్డ్‌ పైపైకి చూడటం ప్రారంభించిది. దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చిన లేమాన్‌ బ్రదర్స్‌ దివాళాతో గోల్డ్‌ రేట్స్‌కు రెక్కలు వచ్చాయి.

ఇక తగ్గేదేలే లేదన్నట్లు 2010 నుంచి 2020 మధ్య గోల్డ్‌లో భారీ ర్యాలీ కొనసాగింది. ఆ తర్వాత కోవిడ్‌ ఎఫెక్ట్‌తో గోల్డ్‌ రేట్‌ భారీగా పెరిగినప్పటికీ.. ఆ తర్వాత అంతే స్థాయిలో పతనమైంది. గత ఏడాది నుంచి గోల్డ్‌ రేట్‌ పైపైకి చూస్తోంది. ముఖ్యంగా గత నెలరోజుల్లో గోల్డ్‌ రేట్‌ 8వేలకు పైగా పెరిగింది.

7 రెట్లు పెరుగుదల
2007లో 10వేల రూపాయలు ఉన్న బంగారం ధర 17 ఏళ్లలో 7 రెట్లకు పైగా పెరిగింది. 2011, 2012లో గోల్డ్‌ రేట్‌ పెరిగినప్పటికీ.. ఆ తర్వాత కొంచెం శాంతించింది. 2011లో 20వేల రూపాయలు ఉన్న గోల్డ్‌ రేట్‌.. 2012లో 30వేలకు ఎగబాకింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లు అంటే 2020 వరకు గోల్డ్‌లో ఓ మోస్తారు ర్యాలీ కొనసాగింది.

కోవిడ్‌ సంక్షోభ ప్రభావంతో 2020లో గోల్డ్‌ రేట్‌ 40వేలకు, 2022లో 50వేలకు చేరింది. ఇక గత ఏడాది 60వేలను అధిగమించిన బంగారం ధర గత నెల్లో 70వేలను క్రాస్‌ చేసింది. ఏప్రిల్‌ 2న అది కాస్తా 72 వేల మార్క్‌ను దాటింది.. మొత్తంగా గడిచిన 4 ఏళ్లలో 30 వేలకు పైగా పెరిగిన గోల్డ్‌ మరిన్ని మైల్‌స్టోన్స్‌ను క్రాస్‌ చేసేందుకు దూసుకుపోతోంది.

Also Read: తమ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చిన బైజూస్‌

ట్రెండింగ్ వార్తలు