Byjus: తమ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చిన బైజూస్‌

లే ఆఫ్స్ గురించి కొందరు సిబ్బందికి బైజూస్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు బైజూస్ వర్గాలు తెలిపాయి.

Byjus: తమ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చిన బైజూస్‌

Byjus

ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ మరో 500 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో సేల్స్ విభాగంలోని వారు కూడా ఉన్నారు. ఆర్థికంగా కుదేలవుతున్న బైజూస్.. తమ సంస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 20 రోజుల నుంచి ఉద్యోగులను తొలగించే పనిలో బైజూస్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగాల కోత ప్రభావం బైజూస్ సేల్స్ కార్యకలాపాలు, టీచర్లు, కొన్ని ట్యూషన్ సెంటర్లపై పడుతుంది. తాజా తొలగింపులకు సంబంధించి బైజూస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇప్పటికే బైజూస్ కొందరు పెట్టుబడిదారులతో చట్టపర సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఫోన్ ద్వారా సమాచారం
లే ఆఫ్స్ గురించి కొందరు సిబ్బందికి బైజూస్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు బైజూస్ వర్గాలు తెలిపాయి. తమ బిజినెస్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు 2023 అక్టోబరులో చేసిన ప్రకటనకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పాయి. ఖర్చును తగ్గించుకోవడం, నిర్వహణ ప్రక్రియను మరింత సరళీకృతం చేయడంపై దృష్టి పెట్టినట్లు బైజూస్ వర్గాలు తెలిపాయి.

నలుగురు విదేశీ పెట్టుబడిదారులతో బైజూస్ ఎదుర్కొంటున్న చట్టపర సమస్యల కారణంగా తమ సంస్థ ప్రస్తుతం అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటుందన్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పాయి. తమ సంస్థ నెట్‌వర్క్, ఉద్యోగులు చాలా ఒత్తిడికి గురవుతున్నారని తెలిపాయి.

కాగా, తమ సంస్థను సమర్థంగా నడిపించడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి చేపట్టిన ప్రక్రియ ప్రభావం దాదాపు 4,500 మందిపై పడుతుందని బైజూస్ గతంలోనే చెప్పింది. ఆ తర్వాత 2023 అక్టోబర్-నవంబర్‌లో 2,500-3,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చింది.

Gold Rate : బంగారం ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?