ఏడాదికాలంగా 17 ఏళ్ల బాలికపై ముగ్గురి అత్యాచారం……8వ నెల గర్భవతి

తమిళనాడులో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు ఏడాదికాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దాంతో బాలిక గర్భం ధరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
17 ఏళ్ల బాలికి 10 వతరగతి ఫెయిల్ అవటంతో ఏడాదికి పైగా కావేరి పట్టణం సమీపంలోని గ్రామంలోని మేన మావ ఇంటి వద్ద, తన తల్లితో పాటు ఉంటోంది. మేనమావ ఇంటి సమీపంలోని నిందితులు ఆమెపై ఏడాది కాలంగా వివిధ సందర్భాల్లో అత్యాచారం చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం బాలికకు నెలసరి రుతుక్రమం రాకపోయే సరికి తల్లి సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించటంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలికను పరీక్షంచిన డాక్టర్లు 8వ నెల గర్బవతిగా తేల్చారు.
డాక్టర్లు ఆమాట చెప్పటంతో షాక్ కు గురైన కుటుంబ సభ్యులు బాలికను విచారించారు. బాలిక ఏడాది కాలంగా తనపై జరిగిన లైంగిక దాడిని వివరించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులను మేనమావ బంధువులుశక్తి, రామరాజ్ , మరియు వారి ఇంటివద్ద నివసించే ఉదయానన్ లుగా గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఉదయానన్, శక్తిలను అరెస్ట్ చేశారు. వారి బంధువైన రామరాజ్ తప్పించుకుపారిపోయాడు. త్వరలోనే అతడ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. బాలికను ప్రభుత్వ బాలికా సంరక్షణ కేంద్రానికి తరలించారు.