Aaradhya Bachchan : ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య ఇప్పుడు ఎలా ఉందో చూశారా? ఎంత పెద్దదైపోయింది
బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య-అభిషేక్‌ల కూతురంటే జనాల ఫోకస్ మామూలుగా ఉండదు. ఆరాధ్య బచ్చన్ బయటకు వచ్చినప్పుడల్లా వార్త అవుతుంది. తాజాగా క్యూట్ లుక్స్‌తో కనిపించి అప్పుడే ఇంత పెద్దదైందా? అని ఆశ్చర్యపోయేలా చేసింది ఆరాధ్య.
Aaradhya Bachchan : సెలబ్రిటీల పిల్లల గురించి తెలుసుకోవాలనే కుతూహలం చాలామందిలో ఉంటుంది. బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ మీద చాలానే ఫోకస్ ఉంటుంది. రీసెంట్‌గా ఆరాధ్యకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆరాధ్య ఇంత క్యూట్‌గా ఎప్పుడు అయ్యింది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Ram Gopal Varma : వివేకా కేసులోని నిందుతుడిని ‘వ్యూహం’ సినిమాలో వర్మ చూపించబోతున్నాడా..?
ఐశ్వర్య-అభిషేక్‌కి 2007 లో వివాహమైంది. వారి కుమార్తె ఆరాధ్యకు 11 ఏళ్లు. ప్రస్తుతం ఆరాధ్య స్కూల్ స్టడీస్‌లో బిజీగా ఉంది. బాంద్రాలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటోంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అమ్మా,నాన్నలతో బయట కనిపిస్తూ ఉంటుంది ఆరాధ్య. రీసెంట్‌గా ఆరాధ్య వీడియో వైరల్ అయ్యింది.. స్కూల్లో స్నేహితుల మధ్య కనిపించిన ఆరాధ్య లిప్ స్టిక్ వేసుకున్నట్లు కనిపించింది. దీనిపై నెటిజన్లు ట్రోల్ కూడా చేశారు. స్కూల్‌కి లిప్ స్టిక్ వేసుకుని వెళతారా? అంటూ నెగెటివ్ కామెంట్స్ పెట్టారు.
Top music director : సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అతడేనా..? సినిమాకి రూ.10కోట్లు..?
కట్ చేస్తే aaradhyaraibachchanofficial ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోపై క్లారిటీ వచ్చింది. ఆరాధ్య తన స్కూల్లో జరిగిన ఒక ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసిందట. అందుకే లిప్ స్టిక్ వేసుకుందట. ‘లిప్ స్టిక్ వేసుకుందని ఆమెను తక్కువగా అంచనా వేయద్దని ఇది AI రూపొందించిన వీడియో కాదు సరిగ్గా చూడమంటూ’ ఆ పోస్టు సారాంశం. వీడియోలో మాత్రం ఆరాధ్య లుక్స్ అదిరిపోయాయి. చిరునవ్వుతో కాస్త సిగ్గుపడుతూ అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
View this post on Instagram