ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆంటీతో చాటింగ్

  • Published By: murthy ,Published On : September 16, 2020 / 04:39 PM IST
ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆంటీతో చాటింగ్

Updated On : September 16, 2020 / 5:20 PM IST

పెళ్లైన మహిళతో సోషల్ మీడియాలో చాటింగ్…. ఒక వ్యక్తి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ చేసిన వ్యక్తిని, ఆ మహిళ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్ర లోని పూణేలో జరిగింది.

వారిద్దరి పరిచయం అయిన తర్వాత ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. ఒకరినొకరు చూసుకోలేదు. కేవలం తన భార్య పరాయి మగాడితో చాటింగ్ చేసి…….పోన్ లో మాట్లాడుతోందనే కడుపు మంటతోనే ఆమె భర్త ఈదారుణానికి ఒడి గట్టాడు.



పూణే లోని సంజయ్ నగర్ కు చెందిన సౌరభ్ జాదవ్ ఒక మొబైల్ యాక్సెసరీస్ కంపెనీలో డెలివరీ బాయ్ గా పని చేసేవాడు. అతనికి ఫేస్ బుక్ ద్వారా అదే ప్రాంతానికి చెందిన పెళ్లైన మహిళతో పరిచయం అయ్యింది. ఇద్దరూ తరుచూ మెసెంజర్ ద్వారా చాటింగ్ చేసుకునేవారు. ఒకే ఏరియాలో నివసిస్తూ ఉండటంతో ఆ పరిచయంలో భాగంగా సౌరభ్ ఆంటీ ఫోన్ నెంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి సౌరభ్ ఆంటీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉండేవాడు.
https://10tv.in/miss-you-dear-i-love-you-late-night-messages-to-woman-police-official-from-judge/
కొన్నాళ్లకు ఈ విషయాన్ని ఆమె భర్త అజయ్ షేక్ గమనించాడు. తన భార్య పరాయి వ్యక్తి తో చాటింగ్ చేయటం ఫోన్ లో మాట్లాడటం చూసిన భర్త సహించలేక పోయాడు. తనభార్య మరోకరితో క్లోజ్ గా ఉండటం భరించలేక పోయాడు. ఎలాగైనా తన భార్య సోషల్ మీడియా ఫ్రెండ్ ను తుదముట్టించాలను కున్నాడు.



వీరిద్దరికీ పెళ్ళికి ముందునుంచే స్నేహం ఉందని అనుమానించాడు. తనభార్య పరాయి మగవాడితో చనువుగా మాట్లాడం సహించలేకపోయాడు. అందుకు అతని స్నేహితుడు సోన్యా బరాత్ సహాయం తీసుకున్నాడు. విషయం అతడికి వివరించాడు. అందుకు అతను ఓకే అన్నాడు అజయ్ షేక్.

తనభార్య సెల్ ఫోన్ నుంచి సౌరభ్ జాదవ్ ఫోన్ నెంబరు సేకరించాడు. సెప్టంబర్ 13 ఆదివారం నాడు సౌరభ్ ను అవుంద్ ఆస్పత్రి వద్దకు రమ్మని ఫోన్ చేశారు. అక్కడ తన స్నేహితుడు సోన్యాబరాత్ తో సిధ్దంగా ఉన్నాడు అజయ్. సౌరభ్ ఆస్పత్రి వద్దకురాగానే అజయ్ షేక్ మిత్రుడితో కలిసి సౌరభ్ మెడ, చేతులు తలపై కిరాతకంగా నరికి హత్యేచేశారు. సౌరభ్ సోదరుడు సుశాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.