Covid Test Private Part : కరోనా టెస్ట్ పేరుతో నీచం.. యువతి ప్రైవేట్ పార్టులో చేయి పెట్టి..
కరోనా టెస్ట్ పేరుతో ఓ ల్యాబ్ టెక్నీషియన్ దారుణానికి ఒడిగట్టాడు. యువతి ప్రైవేట్ భాగంలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో అతడికి..

Covid Test
Covid Test Private Part : కరోనా టెస్ట్ పేరుతో ఓ ల్యాబ్ టెక్నీషియన్ దారుణానికి ఒడిగట్టాడు. యువతి ప్రైవేట్ భాగంలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో అతనికి కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
అమరావతిలోని ఒక మాల్ లో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అలర్ట్ అయిన యాజమాన్యం.. మిగతా ఉద్యోగులందరికీ కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయించింది. మాల్‌లోని ఉద్యోగులందరూ వడ్నేరాలోని ట్రామా కేర్ సెంటర్‌లో కరోనా పరీక్షలు చేయించుకోవాలంది. ట్రామా కేర్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న అల్కేష్ దేశ్‌ముఖ్.. మాల్ ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు చేశాడు.
Children Sleep : పిల్లలు రాత్రిళ్లు త్వరగా నిద్రించటం లేదా?
వారిలో ఓ యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. మిగతా టెస్టులకు ల్యాబ్ కి రావాలని తెలిపాడు. అక్కడ ఆల్కేష్ నీచానికి ఒడిగట్టాడు. మీ ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ సేకరించాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఆమె షాక్ తింది. వాస్తవానికి స్వాబ్ శాంపిల్ ని ముక్కు నుంచి, గొంతు నుంచి తీసుకుంటారు. ఇది కామన్. కానీ, అందుకు భిన్నంగా ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ తీస్తానని అతడు చెప్పడంతో యువతి విస్తుపోయింది. తాను అలా చేయలేనని తేల్చి చెప్పింది. అయినా అతను వినలేదు. కరోనా పరీక్షలో ఒక భాగమేనని నమ్మపలికాడు. ఆమె ప్రైవేట్ పార్ట్ నుంచి ఒక స్వాబ్ శాంపిల్ సేకరించాడు. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్ లో చేయి పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు.
యువతి ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. విషయం తెలుసుకుని కంగుతిన్న అతడు.. యువతితో కలిసి వడ్నేరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ల్యాబ్ టెక్నీషియన్ అల్కేష్ దేశ్‌ముఖ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నీచుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల ఈ కేసును అమరావతి జిల్లా కోర్టు విచారించింది. నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతోపాటు రూ.10వేలు జరిమానా విధించింది కోర్టు.
Maharashtra : కరోనా టీకాతో కూతురు చనిపోయింది.. రూ. 1000 కోట్లు ఇవ్వాలన్న తండ్రి
ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రేప్ చార్జెస్ కింద ల్యాబ్ టెక్నీషియన్ ను పోలీసులు జూలై 30, 2020లో అరెస్ట్ చేశారు. 17 నెలల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. ఈ కేసులో 12మంది సాక్ష్యులు కోర్టు ముందుకు వచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్నాక.. నేరం రుజువైనట్లు కోర్టు తేల్చింది.