Mahabubabad : 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి.. ఛాతిలో నొప్పి అంతలోనే విషాదం

బోడ స్రవంతి అనే 13 సంవత్సరాల వయసున్న  బాలిక 6వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో స్రవంతి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో బాలికను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి తీసుకొొచ్చారు.

Mahabubabad : 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి.. ఛాతిలో నొప్పి అంతలోనే విషాదం

Mahabubabad

Mahabubabad : తెలంగాణలో గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. ఇటీవలికాలంలో పలువురు గుండెపోటుతో మృతి చెందారు. తాజాగా మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. 13 సంవత్సరాల బాలిక గుండెపోటుతో చనిపోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున బాలిక(13)గుండెపోటుతో మృతి చెందారు.

బోడ స్రవంతి అనే 13 సంవత్సరాల వయసున్న  బాలిక 6వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో స్రవంతి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో బాలికను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి తీసుకొొచ్చారు. ఆ తర్వాత తాతయ్య ఇంట్లో బాలిక కుప్పకూలిపోయి మృతి చెందారు.

WHO Heart Attacks : గుండెపోటు మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే-డబ్ల్యూహెచ్ఓ కీలక నివేదిక

గరువారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో నిదిస్తున్న బాలిక లేచిందని పోలీసులు తెలిపారు. శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని, ఛాతిలో నొప్పి వస్తుందని అమ్మమ్మకు బాలిక చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు లేచి ఆటోలో బాలికను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ, బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మరిపెడలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో బాలిక స్రవంతి 6వ తరగతి చదువుతున్నారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా పాఠశాలకు సెలవు ఇచ్చారు. దీంతో బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకున్నారు. రాత్రి తన తాతయ్య ఇంట్లో నిద్ర పోయారు.

Heart Attack : ఆగని గుండెపోటు మరణాలు.. హార్ట్ ఎటాక్‌తో మరో విద్యార్థి మృతి, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే..

బాలిక తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఆ దంపతులకు స్రవంతి రెండో కూతురు. బాలిక గుండెపోటుతో మృతి చెందారన్న వార్త తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణలో గత 1-2 నెలల్లో యువకులు, విద్యార్థులు హఠాత్తుగా గుండెపోటుకు గురవుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.