Wedding Tragedy : పెళ్లివేడుకలో విషాదం.. వరుడు డ్రైవింగ్.. దూసుకెళ్లిన కారు..!
Wedding Tragedy : చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలోని పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బరాత్ తీస్తున్న వారిపై కారు దూసుకెళ్లింది. వధువు, వరుడు కారు ప్రయాణిస్తున్న కారు..

13 Years Old Boy Died In Wedding Baraat At Yadadri District
Wedding Tragedy : చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలోని పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బరాత్ తీస్తున్న వారిపై కారు దూసుకెళ్లింది. వధువు, వరుడు కారు ప్రయాణిస్తున్న కారు.. బరాత్‌లో డాన్స్ చేస్తున్న వారిపై దూసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో దుబ్బాక సాయిచరణ్ (13) అనే బాలుడు మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. గట్టుప్పలకు చెందిన మల్లేశ్ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురంలో జరిగింది. ఆ రాత్రి వధువుతో కలిసి తన స్వగ్రామానికి కారులో బయల్దేరాడు.
డీజే పాటలతో ఇంటివరకు బరాత్ ఏర్పాటు చేశారు. ఇంటికి కొద్దిదూరంలో వరుడు, వధువు కారులో నుంచి బంధువులతో డ్యాన్స్ చేశారు. అనంతరం తిరిగి కారులో బయల్దేరారు. కారు డ్రైవర్ కు బదులుగా వరుడే కారును డ్రైవ్ చేశాడు. డ్రైవింగ్ రాకపోయినా కారును నడిపేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో కారు ఎదురుగా డ్యాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. డీజే బాక్సులు ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 13ఏళ్ల బాలుడు కారు కింద పడి మృతిచెందాడు. వరుడు సహా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వరుడు మల్లేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై నవీన్ వెల్లడించారు.
Read Also : Aadhi Nikki Wedding: ఆది పెళ్లిలో స్టెప్పులేసిన నాని, సందీప్.. వీడియో వైరల్!