Cyclone Jawad : జొవాద్ తుపాను ఎఫెక్ట్-కొబ్బరిచెట్టు పడి బాలిక మృతి

జొవాద్ తుపాను కారణంగా వీచిన బలమైన గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడి ఒక విద్యార్ధిని మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, ఉద్దానం మెలియాపుట్టి గ్రామంలో ఈ విషాదకర సంఘ

Cyclone Jawad : జొవాద్  తుపాను కారణంగా వీచిన బలమైన గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడి ఒక విద్యార్ధిని మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, ఉద్దానం మెలియాపుట్టి గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

జొవాద్ తుపాను ప్రభావంతో వీచిన గాలులకు ఇంటర్ విద్యార్థిని గొరకల హిందు (17)పై కొబ్బరి చెట్టు పడడంతో మృత్యువాత పడింది. ఘటన జరిగిన వెంటనే స్పృహలో ఉన్న బాలికను స్థానికులు పూండి ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లారు. మార్గమధ్యలోనే బాలిక మరణించినట్లు వైద్యులు చెప్పడంతో,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read : Mother And Daughter Killed : ప్రకాశం జిల్లాలో తల్లి,కూతురు దారుణ హత్య

పదిహేడేళ్ల  బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి ఆవరణలోని   బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మృతురాలి బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిని మృతిచెందడం పట్ల రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు బాలిక కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు