Mother And Daughter Killed : ప్రకాశం జిల్లాలో తల్లి,కూతురు దారుణ హత్య

ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్యలు జరిగాయి. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం

Mother And Daughter Killed : ప్రకాశం జిల్లాలో తల్లి,కూతురు దారుణ హత్య

Prakasam District Murder

Updated On : December 4, 2021 / 4:40 PM IST

Mother And Daughter Killed : ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్యలు జరిగాయి. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

టంగుటూరులో బంగారం వ్యాపారి  జలదంకి రవికిషోర్‌ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్‌  సింగరాయకొండ రోడ్డులో ఆర్‌.కె.జ్యూయలర్స్‌ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేదు. కుమార్తెకు ఫోన్ చేయగా కుమార్తె ఫోన్ నుంచి కూడా సమాధానం రాలేదు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూడగా భార్య శ్రీదేవి, కుమార్తె వెంకట లేఖన(21)లు గొంతు కోసిన  స్ధితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. రవికిషోర్ ఈవిషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారి ద్వారా సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు.

Also Read : Road Acccident : రోడ్డు ప్రమాదం-ప్రియురాలు మృతి-ప్రియుడు ఆత్మహత్య

రవికిషోర్ కుమార్తె మేఘన ప్రస్తుతం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ హత్యలు ఎవరు చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఈరోజు ఉదయం ఘటనా స్ధలానికి వచ్చి పోలీసుల వద్ద నుండి,స్ధానికుల నుండి వివరాలు సేకరించారు. కాగా…. రవికిషోర్‌ సోదరుడు రంగాకు చెందిన బంగారు ఆభరణాల దుకాణంలో మూడు నెలల క్రితం సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన రవికిషోర్‌ భార్య, కుమార్తె హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు నేతృత్వంలో క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది.