Chennai Rave Party : చెన్నైలో రేవ్ పార్టీ.. 23ఏళ్ల యువకుడి మృతిపై అనుమానాలు.. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణమా?

Chennai Rave Party : చెన్నైలోని కోయంబేడు సమీపంలో మాల్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విదేశీ మద్యం తాగిన 23ఏళ్ల యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

23 Year Old Dies After Rave Party In Chennai, Drug Overdose Suspected

Chennai Rave Party : చెన్నైలోని కోయంబేడు సమీపంలో మాల్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విదేశీ మద్యం తాగిన 23ఏళ్ల యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దాంతో ఈ రేవ్ పార్టీ గుట్టు రట్టయ్యింది. చెన్నై శివారు ప్రాంతాలు, నగరంలో వీకెండ్‌ పార్టీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కోయంబేడు సమీపంలోని ఓ మాల్‌లో పోలీసుల అనుమతి లేకుండా రేవ్ పార్టీ నిర్వహించారు.

బ్రిజిల్‌ నుంచి ప్రముఖ డీజే మన్డ్రో గ్రోవా బృందం ఈ పార్టీలో రాక్‌ మ్యూజిక్‌ అందించింది. విదేశీ మద్యం తాగి మత్తులో మునిగిపోయారు. అతిగా మద్యం సేవించిన మడిపాక్కంకు చెందిన ఎస్ ప్రవీణ్ అనే యువకుడు స్పృహ తప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

23 Year Old Dies After Rave Party In Chennai, Drug Overdose Suspected 

సమాచారం అందుకున్న అన్నానగర్‌ పోలీసులు రేవ్ పార్టీని అడ్డుకున్నారు. యువతను బయటకు పంపేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. స్పృహ కోల్పోయిన ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడి మృతికి డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో మత్తు పదార్థాల వాడకంపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : Gunturu Rave Party : పుట్టినరోజు వేడుకల్లో రేవ్‌పార్టీ… పోలీసుల అదుపులో ముగ్గురు యువతులు