Gunturu Rave Party : పుట్టినరోజు వేడుకల్లో రేవ్‌పార్టీ… పోలీసుల అదుపులో ముగ్గురు యువతులు

గుంటూరు అరండల్‌పేట‌లోని ఒక హోటల్‌లో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో  రేవ్ పార్టీ  నిర్వహిస్తున్నారని  పోలీసులకు సమాచారం వచ్చింది.

Gunturu Rave Party : పుట్టినరోజు వేడుకల్లో రేవ్‌పార్టీ… పోలీసుల అదుపులో ముగ్గురు యువతులు

Gunturu Rave Party

Updated On : June 26, 2021 / 12:09 PM IST

Gunturu Rave Party : గుంటూరు అరండల్‌పేట‌లోని ఒక హోటల్‌లో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో  రేవ్ పార్టీ  నిర్వహిస్తున్నారని  పోలీసులకు సమాచారం వచ్చింది. కాల్‌గర్ల్స్ ని రప్పించి కార్యక్రమాలు ఏర్పాటు చేశారనే సమాచారంతో పోలీసులు హోటల్ పై దాడులు చేసారు. ముగ్గురు యువతులను, ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు.

శుక్రవారం రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాటానికి యువతులను బెంగుళూరు నుంచి రప్పించినట్లు సమాచారం. యువతులను స్త్రీ పునరావాస కేంద్రానికి తరలించారు. హోటల్ లో ఖరీదైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హోటల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే రేవ్ పార్టీ నిర్వహించారా? లేదా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.