ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతోందని.. భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 12:13 AM IST
ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతోందని.. భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

Updated On : February 29, 2020 / 12:13 AM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫోన్ లో పరాయి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతోందని, అందుకే తాను ఈ పని చేశానని భర్త రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. 

సూసైడ్ నోట్ రాసి:
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలున్నారు. రెండేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. భార్య వయసు 25ఏళ్లు, భర్త వయసు 27ఏళ్లు. ఇంట్లో భార్య పిల్లల మృతదేహాలు నేలపై ఉన్నాయి. భర్త మృతదేహాం సీలింగ్ కు వేలాడుతూ ఉంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసిన భర్త.. దాన్ని గోడకు అంటించాడు. 

ఫోన్ లో పరాయి వ్యక్తులతో మాట్లాడుతోందని:
నా భార్య ఎంత చెప్పినా వినడం లేదు. ఫోన్ లో పరాయి వ్యక్తులతో మాట్లాడుతోంది. వైఖరి మార్చుకోవాలని చాలాసార్లు చెప్పా. అయినా మారలేదు. అందుకే చంపేశా అని సూసైడ్ నోటులో రాశాడు. కాగా, మృతుడికి తాగుడు వ్యసనం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని సందేహిస్తున్నారు. భార్యపై అనుమానంతో భర్త చంపి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినా.. పూర్తి విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. మృతులు వెస్ట్రన్ యూపీలోని బిజ్నూర్ కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బతుకుదెరువు కోసం ఘజియాబాద్ వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. 

గోడపై 5 ఫోన్ నెంబర్లు రాసి ఆత్మహత్య:
ఆత్మహత్యకు ముందు.. ఆ భర్త.. గోడపై 5 మొబైల్ నెంబర్లు కూడా రాశాడు. తన భార్య ఆ నెంబర్లకు ఎక్కువ సార్లు కాల్ చేసి మాట్లాడేదని ఆరోపించాడు. ఫోన్ లో పరాయి వ్యక్తులతో ఎక్కువ మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా భార్య వినిపించుకోలేదని అందుకే ఈ పని చేశానని సూసైడ్ నోట్ లో రాశాడు. ఫోన్ కాల్స్ విషయమై తరుచుగా ఇద్దరూ గొడవ పడేవారని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆ ఐదు ఫోన్ నెంబర్లను నోట్ చేసుకున్న పోలీసులు.. వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడుతోందనే కారణంతో భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కాగా, అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు కూడా బలైపోవడం బాధించింది. వాళ్లు ఏం పాపం చేశారు? వాళ్లని ఎందుకు చంపేశారు? అని అంతా రోదిస్తున్నారు. పెద్దల ఆవేశానికి పిల్లలు బలయ్యారని కంటతడి పెట్టారు.