ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.30 లక్షలు వసూలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసంగించాడు. అమాయకులకు రూ. 30 లక్షలు టోకరా వేశాడు.

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 05:09 AM IST
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.30 లక్షలు వసూలు

Updated On : May 28, 2020 / 3:45 PM IST

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసంగించాడు. అమాయకులకు రూ. 30 లక్షలు టోకరా వేశాడు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసంగించాడు. అమాయకులకు రూ. 30 లక్షలు టోకరా వేశాడు. సంతోష్ అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని 30 మంది నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశాడు. నకిలీ గుర్తింపు కార్టు తయారు చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయలు వసూలు చేశాడు. 

రోజులు గడుస్తున్నా సంతోష్‌ దగ్గర నుంచి పిలుపు రాకపోవటంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Also Read : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు