నిత్యానంద ఆశ్రమంలో రహస్య స్థావరం: లీక్ అయిన వీడియో

ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశమ్రంలోకి తన నలుగురు చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లారని స్వామి శిష్యుడు ఒకరు ఆరోపిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి ఆశ్రమంలోనే ఉంచారని అంటున్నాడు. ఆ నలుగురు చిన్నారుల్లో తన ఇద్దరు కూతుళ్లు మాత్రం తమ ఇష్టపూర్తిగానే ఆశ్రమంలోకి వెళ్లినట్టు చెప్పడం గమనార్హం. నిత్యానంద స్వామి శిష్యుడైన జనార్థన్ శర్మ ఇటీవలే తన ముగ్గురు కూతుళ్లు సహా ఒక కుమారుడిని బలవంతంగా ఆశమ్రంలోకి తీసుకెళ్లారని ఆరోపించాడు.
అంతకుముందు బిడాడిలోని గురుకుల్ ఆశ్రమంలో వారంతా ఉన్నారు. కానీ, అక్కడి నుంచి వారిని తనకు ఎలాంటి సమాచారం లేకుండా అహ్మదాబాద్‌కు తరలించినట్టు జనార్థన్ ఆరోపిస్తున్నాడు. తమ పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులను గురుకుల్ సిబ్బంది అనుమతించడం లేదని విమర్శించాడు. ‘ నాలుగు నెలల నుంచి పిల్లల ఆచూకీ కోసం నిరంతరాయంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా పిల్లలను కలిసేందుకు అనుమతించడం లేదు. సంస్థలో ఒకప్పుడు పనిచేసినప్పటికీ తనను లోపలికి అనుమతించడం లేదు’ అని శర్మ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశ్రమానికి వెళ్లి ఒక బాలిక, బాలుడిని తమ తల్లిదండ్రులకు అప్పగించారు.
‘నవంబర్ 1న బాధితుడు శర్మ నుంచి ఫిర్యాదు అందింది. అశ్రమంలో ఉన్న అతడి19ఏళ్ల కుమార్తె నుంచి కూడా వాంగ్మూలాన్ని తీసుకున్నాం. ఈ అశ్రమంలోకి తాను ఇష్టపూర్వకంగానే వెళ్లానని, తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్లేందుకు ఇష్టం లేదని చెప్పినట్టు డిప్యూటీ ఎస్ పి హెచ్ఎస్ శార్దా తెలిపారు. మరో కుమార్తె ఆశ్రమ కమిటీతో కలిసి పర్యాటనకు వెళ్లిందని తిరిగి వచ్చాక ఆమె వాంగూల్మాన్ని కూడా రికార్డు చేస్తాం’ అని అన్నారు. ఇదిలా ఉండగా, 19ఏళ్ల బాలిక, ఆమె సోదరి ఎక్కడ ఉన్నారో తెలియదు. గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫేస్ బుక్ లో వీడియో లీక్ అయింది.
ఆశ్రమం నుంచి తమను తల్లిదండ్రులు తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వీడియోలో చిన్నారులు ఆరోపించారు. కాగా, అత్యాచారం కేసులో స్వామి నిత్యానందకు 2018 సెప్టెంబర్ నెలలో జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2019 జనవరిలో హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. ప్రస్తుతం నిత్యానంద అజ్ఞాతంలోకి ఉన్నట్టు సమాచారం.