19ఏళ్ల కుర్రాడితో ఆంటీ జంప్.. ఎక్కడికి తీసుకెళ్లిందో, ఏం చేసిందో..
కర్నాటక రాష్ట్రం రాయచూరులో దారుణం జరిగింది. 45 ఏళ్ల ఆంటీ 19 ఏళ్ల కుర్రాడితో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళ వివాహిత. భర్త ఉన్నాడు,

కర్నాటక రాష్ట్రం రాయచూరులో దారుణం జరిగింది. 45 ఏళ్ల ఆంటీ 19 ఏళ్ల కుర్రాడితో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళ వివాహిత. భర్త ఉన్నాడు,
కర్నాటక రాష్ట్రం రాయచూరులో దారుణం జరిగింది. 45 ఏళ్ల ఆంటీ 19 ఏళ్ల కుర్రాడితో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళ వివాహిత. భర్త ఉన్నాడు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి మహిళ.. టీనేజీ కుర్రాడితో పారిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అబ్బాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా కొడుకు ఆచూకీ కనిపెట్టి సేఫ్ గా ఇంటికి చేర్చాలని కోరింది.
ప్రేమ పేరుతో మహిళ.. తమ కుర్రాడిని కిడ్నాప్ చేసిందని అబ్బాయి తల్లి ఆరోపించింది. నిర్మల కుమారుడు నరేష్ (19) మహబళేశ్వర సర్కిల్ దగ్గర ఉడుపి హోటల్‌లో పని చేస్తాడు. అదే హోటల్‌లో చంద్రిక (45) అనే మహిళ కూడా పని చేస్తుంది. చంద్రిక తన కొడుక్కి మాయమాటలు చెప్పి గత వారం రోజుల క్రితం ఎక్కడికో తీసుకెళ్లిందని, తన కొడుకు జాడ లేదని నిర్మల విలపిస్తోంది. ఈ మేరకు బుధవారం(మార్చి 4,2020) పోలీసులకు పిర్యాదు చేసింది. చంద్రికకు భర్త, ముగ్గురు పిల్లలున్నారని నిర్మల తెలిపింది. చంద్రిక భర్త లోకేష్ ను అడిగితే.. తనకేమీ తెలియదని చెబుతున్నాడని నిర్మల వాపోయింది.
అభంశుభం తెలియని తన కొడుకుని చంద్రిక ఎక్కడికి తీసుకెళ్లిందో ఏం చేసిందోనని నిర్మల ఆందోళన చెందుతోంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసిందని వాపోయింది. ఎలాగైనా పోలీసులు చంద్రిక ఆచూకీ కనిపెట్టి తన కొడుకుని కాపాడాలని నిర్మల వేడుకుంది. తన కొడుకుని సురక్షితంగా తన దగ్గరికి చేర్చాలంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. చంద్రిక కుటుంబసభ్యులను, ఆమె పని చేసే చోట సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
See Also | దిశ యాప్ మరో సక్సెస్, 8నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు