షాపింగ్ మాల్‌లో దారుణం : 3వ అంతస్తు నుంచి బాలుడిని విసిరేశారు

అమెరికా: మిన్నెపోలిస్ లోని షాపింగ్ మాల్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిని 3వ అంతస్తులోని బాల్కనీ నుంచి విసిరేశారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు.

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 01:20 PM IST
షాపింగ్ మాల్‌లో దారుణం : 3వ అంతస్తు నుంచి బాలుడిని విసిరేశారు

Updated On : April 15, 2019 / 1:20 PM IST

అమెరికా: మిన్నెపోలిస్ లోని షాపింగ్ మాల్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిని 3వ అంతస్తులోని బాల్కనీ నుంచి విసిరేశారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు.

అమెరికా: మిన్నెపోలిస్ లోని షాపింగ్ మాల్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిని 3వ అంతస్తులోని బాల్కనీ నుంచి విసిరేశారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన మాల్ కు వచ్చిన వారిని షాక్ కు గురి చేసింది. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించడం దారుణం అంటున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.

బాబుని ఎవరు విసిరేశారు, ఇది ఎలా జరిగింది అనేది దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ కేసులో మిన్నెపోలీస్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల ఎమ్మానుయల్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై గతంలోనే కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతడి మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. 4.2 మిలియన్స్ స్క్కేర్ ఫీట్ లో ఈ మాల్ ను నిర్మించారు. 520 స్టోర్స్ ఉన్నాయి. 1992లో ఈ మాల్ ను ఓపెన్ చేశారు. ఏడాదికి 40లక్షల మంది ఈ మాల్ కు వస్తుంటారు. బాలుడిని విసిరేసిన ఘటన కస్టమర్లను, సిబ్బందిని షాక్ కు గురి చేసింది. చిన్నపిల్లాడితో అమానుషంగా వ్యవహరించిన వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.