man killed wife and children
Man Killed Wife And Children : హైదరాబాద్ చందానగర్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యలు కాదు హత్యలని పోలీసులు తేల్చారు. చందానగర్ ఘటనలో భర్తే హంతకుడని పోలీసులు తేల్చారు. భార్యపై అనుమానంతోనే నాగరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపారు.
పసిబిడ్డలని కూడా చూడకుండా చంపేశాడు. నాగరాజు ముందుగా భార్య, ఇద్దరు పిల్లలపై కత్తెరతో దాడి చేసి చంపేశారు. తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. నాగరాజు, సునీత శుక్రవారం తమకు చివరిగా కనిపించారని స్థానికులు చెబుతున్నారు.
Man Kills Wife: కూతురుకు తన పోలికలు లేవని దారుణం.. భార్య, కూతురును హత్య చేసిన దుర్మార్గుడు
అయితే ఇంట్లో నుంచి దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. గతంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు తెలిపారు.