Bank Accounts Robbed : బ్యాంకు ఖాతాల్లో లక్షలు మాయం..
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. కస్టమర్లకు తెలియకుండానే వారి అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ఇద్దరు బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు మాయమయ్యాయి.

Bank Accounts Robbed
Bank Accounts Robbed : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్లను ఏదో రకంగా మాయచేసి వారి అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ఫేక్ ఫోన్ కాల్స్ చేస్తూ ఆన్ లైైన్ మోసాలకు పాల్పడుతున్నారు. కస్టమర్లకు తెలియకుండానే వారి అకౌంట్లలో డబ్బులు కాజేస్తున్నారు. ఇద్దరు బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు మాయమయ్యాయి. ఖాతాదారులకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు.
తులసిబాబు అనే వ్యక్తి అకౌంట్ నుంచి రూ.4 లక్షలు మాయం చేశారు. వెంకటేశ్ అనే వ్యక్తి భార్య అకౌంట్ నుంచి రూ.4.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.