Crime News: మూడు హత్యల కేసుల్లో నిందితుడు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ
మూడు హత్య కేసులను పోలీసులు చేధించి నిందితుడిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

Accused arrested (Google Image)
serial Killer Arrest : మూడు హత్యలకు పాల్పడిన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. కందుకూరిలోని వ్యవసాయ క్షేత్రంలో వృద్ధ దంపతుల హత్యతోపాటు గతేడాది జరిగిన మరో మహిళ హత్య కేసును చేధించడం జరిగిందని తెలిపారు. మృతుడు ఉషయ్యకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేశామని, అదేవిధంగా ఏడాది క్రితం జరిగిన హత్య కేసులో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఆ కేసును చేధించడం జరిగిందని సీపీ తెలిపారు. దంపతులు వద్ద దొరికిన ఫింగర్ ప్రింట్స్.. ఏడాది క్రితం జరిగిన మహిళ హత్య కేసులో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఒకే విధంగా ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. ఏడాది క్రితం మహిళను హత్యచేసి అదే ఊరిలో నిందితుడు ఉంటున్నాడని. హతురాలిది, నిందితుడిది ఇద్దరిది ఒకే ఊరని సీపీ తెలిపారు.
Also Read: Yamuna River: ఢిల్లీలోని యమునా నదిలో విషపు నురగ.. నిపుణులు ఏమన్నారంటే?
కొత్తగూడ గ్రామంలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో.. మృతుడు ఉషయ్య నుండి నిందితుడు ఉప్పల శివకుమార్ కు హత్యకు ముందు ఫోన్ కాల్ వెళ్లింది. దీంతో శివకుమార్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తే హత్య వ్యవహారం బయటపడిందని సీపీ తెలిపారు. నిందితుడు శివకుమార్ ఉషయ్య – శాంతమ్మ దగ్గరికి వెళ్లి మాటలు కలిపాడు. ఈ క్రమంలో శాంతమ్మను సెక్సువల్ హెరాస్ చేశాడు. సహకరించకపోవటంతో ఇద్దరిని చంపేశాడు. రెండో కేసులో 2023లో శైలజ రెడ్డిని ఫామ్ హౌస్ లో హత్యచేశాడు. శైలజ కేసులో ఫింగర్ ఫింట్స్ మ్యాచ్ అయ్యాయి. మద్యంకు అలవాటుపడి నిందితుడు అత్యాచారంకు ప్రయత్నించాడు. సహకరించకపోవడంతో హత్య చేశాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని.. నేరస్థుడిపై పాత కేసుల వివరాలను సేకరిస్తున్నామని సీపీ తెలిపారు.
కేసులు డిటెక్షన్ లో రాచకొండ పోలీసులు ముందున్నామని, డయల్ 100కు కాల్ చేసిన వెంటనే స్పందిస్తున్నామని సీపీ తెలిపారు. మహిళా పోలీసులను పెట్టి త్వరితగతిన రెస్పాన్స్ వచ్చేలా చేస్తున్నామని, రాచకొండలో విసుబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని, పోలీసులు నిత్యం గస్తీ కాస్తూ అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారని సీపీ తెలిపారు.