Accused Escaped : పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలైన నిందితుడు

సైబర్‌క్రైమ్  కేసులో అరెస్టైన నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. 

Accused Escaped Delhi

Accused Escaped :  సైబర్‌క్రైమ్  కేసులో అరెస్టైన నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.  సైబర్‌క్రైమ్  కేసుకు సంబంధించి ఒక నిందితుడిని హైదరాబాద్ క్రైమ్ పోలీసులు  ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.

అతడ్ని హైదరాబాద్ తరలించే క్రమంలో వారు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడ పోలీసుల కళ్లుగప్పి నిందితుడు వారి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇందు కోసం తెలంగాణ భవన్ లో అమర్చిన డ్రైనేజ్, వాటర్ పైపులుద్వారా పారిపోయేందుకు ప్రయత్నించాడు.  ఇది గమనించిన పోలీసులు అతడ్ని పట్టుకోటానికి యత్నించారు.
Also Read : Hyderabad youth : గల్ఫ్ లో హైదరాబాద్ యువకుడు అరెస్ట్
ఇంతలో పైపులు పట్టు తప్పి  కింద ఉన్న చెట్టు మీదకు జారి పడ్డాడు.  అక్కడి నుంచి నేలమీద పడటంతో ప్రాణాపాయం  నుండి  తప్పించుకుని తీవ్ర  గాయాలపాలయ్యాడు. నిందితుడ్ని ఆస్పత్రికి తరలించటానికి  పోలీసులు  అక్కడే ఉన్న ఏపీ ప్రభుత్వ అంబులెన్స్ లో ఎక్కించారు. అంబులెన్స్ స్టార్ట్ కాక మొరాయించటంతో  అతడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు.