Priyanka Salve
Priyanka Salve : 1985 లో వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమా ఎవరూ మర్చిపోరు. అందులో నటించిన మందాకినిని మర్చిపోరు. ఇప్పుడు ఆమె టాపిక్ ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు 7 గురు ఉంటారట. అలా అచ్చంగా మందాకిని పోలికలతో ఉన్న ప్రియాంక సాల్వే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు.
Jogulamba Gadwala : మనిషి ముఖాన్ని పోలిన కీటకం
సాధారణంగా మనల్ని చూసి కూడా నీ పోలికలతో ఫలానా వాళ్లని చూసాం అని చెబుతుంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇటీవల కాలంలో చాలామంది నటీనటుల పోలికల్లో ఉన్నవారు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు. ఒకప్పుడు తన గ్లామర్, నటనతో అలరించిన నటి మందాకినిలా ఉండే ప్రియాంక సాల్వే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక ( priyanka_punekar15) చాలా యాక్టివ్ ఉంటారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన ప్రియాంక అప్పట్లో మందాకిని డ్రెస్సింగ్ స్టైల్, నటన, హావభావాలను అనుకరిస్తూ పలు వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
jail restaurant : బెంగళూరులో జైలును పోలిన రెస్టారెంట్ వీడియో వైరల్
ఇక ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించిన నటి మందాకిని అసలు పేరు యాస్మీన్ జోసెఫ్. బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగులో సింహాసనం, భార్గవరాముడు సినిమాలో నటించారు. చివరిగా మందాకిని 1996 లో జోర్దార్‌లో నటించారు. తెరకు దూరమైన కొందరు నటీనటులు వారి పోలీకలతో ఉన్న కొందరి వల్ల ఇలా వైరల్ అవుతున్నారు.