Gold Seized
Gold Seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. అంతే, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఎమర్జెన్సీ లైట్స్ ఉన్నాయి. వాటిని చూడగానే అధికారుల్లో మరింత అనుమానం పెరిగింది.
ఆ లైట్స్ ను ఓపెన్ చేసి చూస్తే గోల్డ్ బయటపడింది. ఎవరూ గుర్తు పట్టకుండా అందులో దాచిన పుత్తడిని అధికారులు గుర్తించారు. 1287.6 గ్రాములున్న 14 కడ్డీలను అమర్చాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో అక్రమ బంగారం వ్యవహారం వెలుగుచూసింది. పట్టుబడిన గోల్డ్ విలువ రూ.68లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. ఇందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును అడ్డాగా మార్చుకున్నారు. ఇటీవలి కాలంలో అక్రమంగా బంగారం తరలించే ప్రయత్నంలో అనేకమంది ప్రయాణికులు అడ్డంగా దొరికిపోయారు. కోట్లలో విలువ చేసే కిలోల కొద్దీ గోల్డ్ ను సీజ్ చేస్తున్నారు అధికారులు. కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు. డేగ కళ్లతో నిఘా కాస్తున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అయినా, గోల్డ్ స్మగ్లింగ్ కు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
కేటుగాళ్లు బంగారం అక్రమ రవాణకు శంషాబాద్ ఎయిర్ పోర్టును తమ అడ్డాగా మార్చుకున్నారు. విదేశాల నుంచి అక్రమ మార్గంలో అనేక పద్దతుల్లో బంగారాన్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు ఎంత నిఘా పెట్టినా.. అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. అయితే, అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు. అడ్డంగా దొరికిపోతున్నారు. వేర్వేరు పద్దతుల్లో అక్రమ బంగారాన్ని తరలిస్తున్న అనేక ముఠాలను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.