Hyderabad : హైదరాబాద్‌లో మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్

Hyderabad : H.U.T ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాఫ్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇటీవల హైదరాబాద్ లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే భోపాల్ లో 11మందిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Terrorist(Photo : Google)

Hyderabad Terrorist : హైదరాబాద్ లో మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. ఏటీఎస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా బాబానగర్, చాంద్రాయణగుట్టలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హెచ్ యూ టీ(H.U.T-Hizb-ut-Tahrir) ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాఫ్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇటీవల హైదరాబాద్ లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే భోపాల్ లో 11మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో అరెస్టుల సంఖ్య 19కి చేరింది.

Also Read..Hyderabad : ఒకడు డెంటిస్ట్, మరొకడు ఇంజినీర్, ఇంకొకడు HOD.. హైదరాబాద్‌లో ఉగ్ర కదలికల కేసులో సంచలన విషయాలు

ఉగ్రవాద కార్యకలాపాలపై అటు మధ్యప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్, ఇటు తెలంగాణకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాబానగర్ నుంచి ఒకరిని, చాంద్రాయణగుట్ట నుంచి ఒకరిని కస్టడీలోకి తీసుకున్నారు. మహారాష్ట్ర ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ జాయింట్ ఆపరేషన్ చేశారు.

Also Read..Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ .. 16మంది అరెస్ట్

అరెస్ట్ అయిన ఈ 19మంది కూడా ఉగ్రవాద సానుభూతిపరులుగా గుర్తించారు. కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకుని ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా వీరంతా భోపాల్, హైదరాబాద్ లో మధ్యలో ఉన్న అనంతగిరి అడవుల్లో ఉగ్రవాద శిక్షణ తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్ కు చెందిన వారు 8మంది అరెస్ట్ అయ్యారు. వీరే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు స్పీడప్ చేశారు.