ముఖ్యమంత్రి సభకు వెళ్తుండగా ప్రమాదం..ఒకరి మృతి
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు.
అనంతపురం : మడకశిరలో విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. చంద్రబాబు ఎన్నికల ప్రచార సభకు వెళ్తుండగా మడకశిరలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఓవర్ లోడ్ తో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.