స్నానం చేస్తుండగా వీడియో తీసి…. బీజేపీ వార్డ్ కౌన్సిలర్ అత్యాచారం

  • Published By: murthy ,Published On : December 9, 2020 / 08:08 AM IST
స్నానం చేస్తుండగా వీడియో తీసి…. బీజేపీ వార్డ్ కౌన్సిలర్ అత్యాచారం

Updated On : December 9, 2020 / 8:36 AM IST

Barmer ward councillor shoots video of bathing woman, rapes her after blackmailing : పరిచయస్తురాలైన మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన బీజేపీ వార్డ్ కౌన్సిలర్ ఉదంతం రాజస్ధాన్ లోని జైపూర్ లో వెలుగు చూసింది. నిందితుడు బాధితురాలికి దూరపు బంధువు అని తెలిసింది.

బాధితురాలు నాలుగేళ్ల క్రితం బాల్టోరాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. బాధితురాలి ఇంటికి కాంతిలాల్ అనే బేజేపీ కౌన్సిలర్ తరచూ వచ్చేవాడు. అతను వారికి దూరపు బంధువు. బాధితురాలి ఇంటికి వచ్చే క్రమంలో ఒకసారి ఆమె స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు.


తర్వాత ఆ వీడియో ఆమెకు చూపించి అత్యాచారం చేయటం మొదలెట్టాడు. కాంతి లాల్ కాకుండా తన స్నేహితుడు జోధారామ్ తో కూడా ఆమెను గడపమని బెదిరించాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ… కాంతిలాల్ అతని స్నేహితుడు ఇద్దరూ ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వివరించింది.



కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చేపట్టామని డీఎస్పీ సుభాష్ ఖోజా తెలిపారు.