Social Media : సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్త.. మైనర్ బాలికపై లైంగిక దాడి, ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు మంచివి కాదన్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని కోరారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.

Becareful With Social Media Friendships (Photo : Google)

సోషల్ మీడియా స్నేహాలు, పరిచయాలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు, ఫ్రెండ్ షిప్ చాలా ప్రమాదకరం కావొచ్చు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో చేసిన స్నేహం ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. లైంగిక దాడికి గురైంది.

సోషల్ మీడియా వేదికగా నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ముంబైలో నివాసం ఉండే మైనర్ బాలికకు సోషల్ మీడియాలో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అతడితో ఫ్రెండ్ షిప్ చేసింది. ఇద్దరూ సోషల్ మీడియాలో తరుచుగా మాట్లాడుకునే వారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అమ్మాయికి తనపై బాగా నమ్మకం కుదిరిన తర్వాత ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టారు. మాయ మాటల చెప్పి బాలికను రప్పించాడు. ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీంతో బాలిక భయపడిపోయింది. లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ నీచుడు ఫోటోలు కూడా తీసుకున్నాడు. వాటి ద్వారా బాలికను బ్లాక్ మెయిల్ చేస్తుండే వాడు.

Also Read : గిరిజన బాలికపై వాలంటీర్ తోపాటు ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్

వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక భరించలేకపోయింది. ఆ యువకుడిని దూరం పెట్టింది. మాట్లాడటం ఆపేసింది. దీంతో ఆ యువకుడు కోపంతో రగిలిపోయాడు. తనను దూరంగా పెట్టడాన్ని తట్టుకోలేకపోయాడు. తన దగ్గరున్న బాలిక ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఐపీసీ, పోక్సో, ఐటీ యాక్ట్.. పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలుసుకున్న నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగాడు. ఇలా నెల రోజులు గడిచాయి. చివరికి అతడు పోలీసులకు దొరికిపోయాడు. థానే జిల్లాలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : వామ్మో.. బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో 13వేల ప్రైవేట్ ఫోటోలు, షాక్‌లో ప్రియురాలు

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు మంచివి కాదన్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని కోరారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పరిచయమై ఫ్రెండ్ షిప్ పేరుతో దగ్గరై లైంగిక దాడులకు పాల్పడుతున్న కేసుల సంఖ్య పెరిగిందని పోలీసులు వెల్లడించారు.

 

ట్రెండింగ్ వార్తలు