Bengaluru : ఓ తల్లి చేసిన ఘోరం.. 4 ఏళ్ల కొడుకుని చంపి బ్యాగులో తరలిస్తుండగా అరెస్టు

భర్తతో విభేదాల కారణంగా తన కొడుకుని పొట్టన పెట్టుకుంది ఓ కన్నతల్లి. ముక్కు పచ్చలారని పసికందును నిర్ధాక్షిణ్యంగా హతమార్చింది. నార్త్ గోవాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.

Bengaluru

Bengaluru : తమ మధ్య వచ్చిన విభేదాల కారణంగా పిల్లలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు కొందరు భార్యాభర్తలు. తన భర్త 4 ఏళ్ల కొడుకుని కలవకుండా ఆపడానికి ఓ ఇల్లాలు ఏ తల్లీ చేయని ఘోరానికి పాల్పడింది. ముక్కుపచ్చలారని పసికందుని దారుణంగా హతమార్చింది. నార్త్ గోవాలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ ఘటన సంచలన రేపింది.


Bengaluru

‘ది మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్’ సీఈఓగా ఉన్న సుచనా సేథ్‌కి 2010 లో వివాహమైంది. 2019 లో వారికి కుమారుడు జన్మించాడు. 2020 లో మనస్పర్థల కారణంగా విడాకులకు అప్లై చేసారు. కోర్టు ఆదివారాల్లో తన బిడ్డను కలవడానికి భర్తకు  అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సుచనా సేథ్ వద్దకు మాజీ భర్త కుమారుడిని కలవడానికి వస్తున్నాడు. అది ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఎలాగైన ఆపాలనుకుంది. అంతే.. దారుణానికి తెగబడింది.

Lee Sun Kyun : డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ‘పారాసైట్’ మూవీ నటుడు ఆత్మహత్య

తన బిడ్డతో కలిసి గోవా ట్రిప్‌కు ప్లాన్ చేసిన సుచనా సేథ్ ముందు నార్త్ గోవాలోని హోటల్ గదిలో చిన్నారిని హత్య చేసింది. హోటల్‌కి కుమారుడితో కలిసి వచ్చి.. ఆమె ఒంటరిగా తిరిగి వెళ్లడంతో సిబ్బందికి అనుమానం రావడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. టాక్సీలో ప్రయాణిస్తున్న సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కొడుకు మృతదేహం బ్యాగులో లభ్యమైంది. సుచనా సేథ్‌ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.