Lee Sun Kyun : డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ‘పారాసైట్’ మూవీ నటుడు ఆత్మహత్య

ప్రముఖ కొరియన్ నటుడు లీ సన్ క్యున్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఈ నటుడు తీవ్ర ఒత్తిడికి లోనై చనిపోయినట్లు తెలుస్తోంది.

Lee Sun Kyun : డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ‘పారాసైట్’ మూవీ నటుడు ఆత్మహత్య

Lee Sun Kyun

Updated On : December 27, 2023 / 5:58 PM IST

Lee Sun Kyun : ప్రముఖ కొరియన్ నటుడు లీ సన్ క్యున్ బలవన్మరణానికి పాల్పడ్డారు. సెంట్రల్ సియోల్‌లో ఆగి ఉన్న కారులో లీ సన్ క్యున్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో లీ సన్ క్యున్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

సుప్రసిద్ధ ఆస్కార్ విన్నింగ్ మూవీ పారాసైట్ ఫేమ్ లీ సన్ క్యున్ (49) ఆత్మహత్య చేసుకున్నారు. సియోల్ లోని ఓ పార్కులో కారులో డెడ్ బాడీని గుర్తించారు. చనిపోవడానికి ముందు లీ సన్ క్యున్ నోట్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు పోలీసులకు నివేదిక అందినట్లు తెలుస్తోంది. లీ సన్ క్యున్ సియోల్ లోని ఓ బార్‌లో హెస్టెస్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అక్టోబర్ నుండి విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లీ సన్ క్యున్ చనిపోవడం సంచలనంగా మారింది. విచారణ సందర్భంలో లీ సన్ క్యున్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారని తట్టుకోలేక చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: సలార్ సినిమాకు A సర్టిఫికెట్ ఎఫెక్ట్.. ప్రభాస్ బుల్లి ఫ్యాన్స్ సలార్‌కి దూరమవుతున్నారా..?

లీ సన్ క్యున్ నటి జయోన్ హై-జిన్‌ను పెళ్లాడారు. వీరికి ఇద్దరు పిల్లలు.. కాగా లీ సన్ క్యున్ అనేక సినిమాలతో పాటు, టీవీ షోలలో నటించారు. దక్షిణ కొరియా సినిమా ‘పారాసైట్’ ఆస్కార్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంతో పాటు 4 ఆస్కార్స్ వచ్చాయి. ఈ సినిమా లీ సన్ క్యున్‌కు అంతర్జాతీయ స్ధాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది.

Also Read : బిగ్‌బాస్ నుంచి బయటకి రాగానే అవార్డు అందుకున్న శోభాశెట్టి.. కార్తీకదీపం పాత్రకు..