Bengaluru Car Bonnet : బాబోయ్.. బెంగళూరులో రెచ్చిపోయిన మహిళ, కారుతో యువకుడిని ఢీకొట్టి 2కి.మీ ఈడ్చుకెళ్లింది

ఓ మహిళ ఓవరాక్షన్ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అతి వేగంతో కారు నడుపుతున్న ప్రియాంక.. జనభారతి నగర్ లో మరో కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఓనర్ దర్శన్.. ప్రియాంకతో గొడవకు దిగాడు. అతడిని బెదిరించిన ప్రియాంక.. కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నించింది.

Bengaluru Car Bonnet : బాబోయ్.. బెంగళూరులో రెచ్చిపోయిన మహిళ, కారుతో యువకుడిని ఢీకొట్టి 2కి.మీ ఈడ్చుకెళ్లింది

Updated On : January 20, 2023 / 8:12 PM IST

Bengaluru Car Bonnet : బెంగళూరులో ఇటీవలే ఓ యువకుడు తన బైక్ తో వృద్ధుడిని కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది మరువక ముందే మరో దారుణం జరిగింది. ఈసారి హిట్ అండ్ రన్ కలకలం రేపిగింది. ఓ మహిళ రెచ్చిపోయింది. ఓ యువకుడిని కారుతో ఢీకొట్టింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదు. బానెట్ పై యువకుడు పడినా పట్టించుకోలేదు. అలాగే కిలోమీటర్ దూరం పోనిచ్చింది.

Also Read..Bengaluru: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ కొడుకు మృతి

ఓ మహిళ ఓవరాక్షన్ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అతి వేగంతో కారు నడుపుతున్న ప్రియాంక.. జనభారతి నగర్ లో మరో కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఓనర్ దర్శన్.. ప్రియాంకతో గొడవకు దిగాడు. అతడిని బెదిరించిన ప్రియాంక.. కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. ఆమె కారుకి దర్శన్ అడ్డుపడినా.. ఆగకుండా కారుని ముందుకు పోనిచ్చింది. దాంతో కారు బానెట్ పై దర్శన్ పడిపోయాడు. అయినా.. ప్రియాంక కారు ఆపలేదు. అలాగే 2 కిలోమీటర్లు పోనిచ్చింది.

Biker Dragged Old Man : వీడు మనిషేనా.. రోడ్డుపై వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన బైకర్.. బెంగళూరులో అమానుషం

రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు అది గమనించి కేకలు పెట్టారు. అయినా ప్రియాంక అస్సలు పట్టించుకోలేదు. రెండు కిలోమీటర్లు అలాగే డ్రైవ్ చేసింది.

ఈ ఘటన వాహనదారులను షాక్ కి గురి చేసింది. ప్రియాంక తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. రద్దీగా ఉన్న రోడ్డుపై దుర్మార్గంగా వ్యవహరించిన ప్రియాంకను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో అందరినీ షాక్ కి గురి చేసింది.

వీడియో ఆధారంగా ప్రియాంకపై ఐపీసీ సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బాధితుడు దర్శన్, యశ్వంత్, సుజన్, విజయ్ అనే నలుగురిపై సెక్షన్ 354 కింద కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియాంక డ్రైవ్ చేస్తున్న కారు టాటా నిక్సన్. దర్శన్ ది స్విఫ్ట్. వీరి ఇద్దరు కార్లు యాక్సిడెంట్ అయ్యాయి. కారు నుంచి బయటకు దిగాడు దర్శన్. ప్రియాంక మాత్రం కారులోనే ఉంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రియాంక కోపంతో ఊగిపోయింది. దర్శన్ ను కారుతో ఢీకొట్టింది. దీంతో అతడు కారు బానెట్ పై పడిపోయాడు. ఆ తర్వాత ప్రియాకం కారుని అలాగే ముందుకు పోనిచ్చింది. బెంగళూరులో ఇలాంటి దారుణం జరగడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండవది.

 

కాగా, ఇటీవలే బెంగళూరులోని మగడి రోడ్డులో ఇలాంటి దారుణమే జరిగింది. టూ వీలర్ రైడర్ రెచ్చిపోయాడు. వృద్ధుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వృద్ధుడిని తన బైక్ తో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.

ముందుగా బైక్ తో కారుని ఢీకొట్టాడు సాహిల్. దీంతో కారు యజమాని కిందకు దిగి సాహిల్ ను అడ్డుకున్నాడు. కారు రిపేర్ కి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దాంతో సాహిల్ దురుసుగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.

 

ఈ క్రమంలో సాహిల్ వెళ్లిపోకుండా వృద్ధుడు బైక్ వెనుక పట్టుకున్నాడు. అయినా సాహిల్ బైక్ ను ఆపలేదు. అలాగే ముందుకు పోనిచ్చాడు. వృద్ధుడిని రోడ్డుపై కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ ఉంది.

ఇది గమనించిన తోటి వాహనదారులు.. షాక్ కి గురయ్యారు. వెంటనే స్పందించిన ఓ ఆటో డ్రైవర్.. బైక్ కు అడ్డుగా తన వాహనం పెట్టడంతో సాహిల్ బైక్ ను ఆపేశాడు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో వృద్ధుడికి ప్రాణాపాయం తప్పింది. 71ఏళ్ల వృద్ధుడు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించిన సాహిల్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు వాహనదారులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.