Bihar Serial Kisser : సీరియల్ కిల్లర్ గురించి వినే ఉంటారు. అంటే, వరుసగా మర్డర్లు చేస్తుంటాడు. హత్య చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ, సీరియల్ కిస్సర్ ను చూశారా? కనీసం విన్నారా? అవును.. వాడో సీరియల్ కిస్సర్. మహిళలే వాడి టార్గెట్. ఎక్కడి నుంచి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలీదు. సడెన్ గా వెనుక నుంచి వస్తాడు. గట్టిగా పట్టుకుంటాడు. బలవంతంగా పెదాలపై ముద్దు పెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఓ సీరియల్ కిస్సర్.. ఇప్పుడు అక్కడి మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.
బీహార్ లో సీరియల్ కిస్సర్ వ్యవహారం కలకలం రేపుతోంది. జమై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి.. స్థానిక మహిళలను బెంబేలెత్తిస్తున్నాడు. వెనుక నుంచి వచ్చి బలవంతంగా ముద్దు పెట్టి వెళ్లిపోతున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం ఓ షాకింగ్ ఘటన జరిగింది. జమై సదర్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ మహిళ శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చింది. ఆమె ఫోన్ లో మాట్లాడటంలో నిమగ్నమై ఉంది. ఇంతలో ఓ వ్యక్తి సడెన్ గా ఆమె వెనుక నుంచి వచ్చాడు. ఆమె చూసేలోపు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత బలవంతంగా పెదాలపై ముద్దు పెట్టాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ షాక్ కి గురైంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read..Couple Kissing : హవ్వ.. లోకల్ ట్రైన్‌లో రెచ్చిపోయిన ప్రేమజంట, పబ్లిక్‌గా లిప్‌లాక్
సీరియస్ కిస్సర్ వ్యవహారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా మహిళలు.. ఒంటరిగా రోడ్డు మీదకు రావాలంటేనే భయపడిపోతున్నాడు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఫుటేజీ ఆధారంగా ఆ దుండగుడిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు జమై సర్దార్ ఆసుపత్రిలో పని చేస్తుంది. ఆసుపత్రి బయట నిల్చుని ఫోన్ లో మాట్లాడుతుండగా.. వెనక నుంచి వచ్చిన వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టడంతో షాక్ కి గురైంది. ఆ దుండగుడి నుంచి విడిపించుకునేందుకు ఆమె గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె కదలకుండా అతడు గట్టిగా బిగించాడు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రి గోడ దూకి మహిళ దగ్గరికి వచ్చాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. సీరియల్ కిస్సర్ ను వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
ఈ ఘటనపై బాధితురాలు స్పందించింది. ”ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతడు గోడ దూకి ఎందుకు వచ్చాడో కూడా తెలీదు. అతడెవరో తెలీదు. అతడికి నేను ఏం చేశాను? అతడు నన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు.. నేను విడిపించుకునే ప్రయత్నం చేశాను. ఆసుపత్రి సిబ్బందిని పిలిచాను. వాళ్లు వచ్చేలోపు ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు” అని బాధితురాలు వాపోయింది. మొత్తంగా సీరియల్ కిస్సర్ వ్యవహారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా మహిళలు భయంతో వణికిపోతున్నారు. వీలైనంత త్వరగా సీరియల్ కిస్సర్ పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
जमुई सदर अस्पताल में महिला स्वास्थ्य कर्मी को दिनदहाड़े युवक ने ज़बरदस्ती किस किया, CCTV में क़ैद हुई घटना. महिला की शिकायत पर FIR दर्ज, महिला सुरक्षा पर उठाये गम्भीर सवाल. pic.twitter.com/uDC2wZ3cMR
— Utkarsh Singh (@UtkarshSingh_) March 13, 2023