ముంబై ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

మహారాష్ట్ర : ముంబై విమానాశ్రయం టెర్నినల్ 2కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మార్చి 2 శనివారం ఉదయం 11 గంటలకు గుర్తు తెలియని నెంబర్ నుంచి విమానాశ్రయం అధికారులకు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో టెర్నినల్ 2 వద్ద విమానాల రాకపోకలను రద్దు చేశారు. టెర్నినల్ 2లోని లెవెల్ 2, 3, 4 లను అధికారులు ఖాళీ చేయించారు.
విమానాశ్రయంలో భద్రతను పెంచారు. భద్రతా సిబ్బంది ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తోన్నారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో బాంబే థ్రెట్ అసెస్ మెంట్ కమిటీ హుటాహుటిన సమావేశం అయింది. విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. రిపోర్టులు కూడా ఇచ్చాయి. ఈనేపథ్యంలో ముంబై ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది.