వేడివేడి సాంబారు పాత్రలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
కర్నూలు జిల్లా పాణ్యం విజయానికేతన్ రెసిడెన్షియల్ లో స్కూల్ లో ఎల్కేజీ విద్యార్థి వేడి వేడి సాంబారు పాత్రలో పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కర్నూలు

కర్నూలు జిల్లా పాణ్యం విజయానికేతన్ రెసిడెన్షియల్ లో స్కూల్ లో ఎల్కేజీ విద్యార్థి వేడి వేడి సాంబారు పాత్రలో పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కర్నూలు
కర్నూలు జిల్లా పాణ్యం విజయానికేతన్ రెసిడెన్షియల్ లో స్కూల్ లో ఎల్కేజీ విద్యార్థి వేడి వేడి సాంబారు పాత్రలో పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు.. దర్యాఫ్తు ప్రారంభించారు. విజయానికేతన్ స్కూల్ లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హాస్టల్ కు అనుమతి లేదని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. హాస్టల్ లో ఏకంగా 1300 మంది విద్యార్థులు ఉంటున్నారని తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. తమ స్కూల్ పై ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా విద్యాశాఖ అధికారులపై రాజకీయ నాయకుల ద్వారా ఫోన్లు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు చెందిన పురుషోత్తమ్ రెడ్డి అనే విద్యార్ధి.. పాణ్యంలోని విజయానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. రోజూలాగానే బుధవారం(నవంబర్ 13,2019) మధ్యాహ్నం పిల్లలు భోజనానికి హాస్టల్ కి వచ్చారు. పురుషోత్తమ్ కూడా వచ్చాడు. అంతా క్యూలైన్ లో నిల్చుని ఉన్నారు. ఇంతలో వెనుక నుంచి ఎవరో నెట్టేయడంతో.. ముందున్న పురుషోత్తం పెద్ద సాంబారు పాత్రలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఆయా వెంటనే బాబుని బయటకు తీసింది. విషయం స్కూల్ యాజమాన్యానికి చెప్పింది.
వేడి వేడి సాంబారులో పడటంతో పురుషోత్తమ్ తీవ్రంగా గాయపడ్డాడు. యాజమాన్యం బాలుడిని స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. ఒళ్లంతా పూర్తిగా కాలడంతో డాక్టర్లు బాబు ప్రాణాలు కాపాడలేకపోయారు.
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే బాబు మృతికి కారణం అని తల్లిదండ్రులు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి. వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్కూల్ గుర్తింపు రద్దు చేయాలన్నారు.