తాళి కట్టడానికి కాసేపటి ముందు పెళ్లి కొడుకు మృతి కేసు : వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
తాళి కట్టడానికి కాసేపటి ముందు పెళ్లి కొడుకు మృతి చెందిన కేసు మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి

తాళి కట్టడానికి కాసేపటి ముందు పెళ్లి కొడుకు మృతి చెందిన కేసు మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి
తాళి కట్టడానికి కాసేపటి ముందు పెళ్లి కొడుకు మృతి చెందిన కేసు మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి కొడుకు సందీప్ ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా, సందీప్ తండ్రి శ్రీనివాసా చారి పోలీసులను ఆశ్రయించారు.
తన కుమారుడి ఆత్మహత్యకు బంధువులే కారణమని శ్రీనివాసా చారి ఆరోపిస్తున్నాడు. సందీప్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్ చిన్నమ్మలు మాధవి, శారదలతో పాటు సందీప్ బాబాయ్ నాగరాజు, సందీప్‌కు సోదరుడి వరసైన శశాంక్‌లపై అనుమానం ఉందని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, అతని ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
ఆదివారం(నవంబర్ 10,2019) కొంపల్లి టీ-జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి కొడుకు సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపట్లో పెళ్లి అనగా.. సందీప్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. కాగా, సందీప్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు.