Pakistan Drones seized: సరిహద్దు జిల్లాలో బీఎస్ఎఫ్ కాల్పులు…రెండు పాక్ డ్రోన్ల స్వాధీనం
దేశ సరిహద్దుల్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం జవాన్లు కూల్చివేశారు. పంజాబ్ రాష్ట్రంలోని తరణ్, తరణ్ జిల్లాలోని రాజోకి గ్రామ శివార్లలో బీఎస్ఎఫ్ జవాన్లు, పంజాబ్ పోలీసులు పాక్ డ్రోన్ ను కూల్చివేసి స్వాధీనం చేసుకున్నారు....

Pakistan Drones seized
Pakistan Drones seized: దేశ సరిహద్దుల్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం జవాన్లు కూల్చివేశారు. పంజాబ్ రాష్ట్రంలోని తరణ్, తరణ్ జిల్లాలోని రాజోకి గ్రామ శివార్లలో బీఎస్ఎఫ్ జవాన్లు, పంజాబ్ పోలీసులు పాక్ డ్రోన్ ను కూల్చివేసి స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ పోలీసులకు అందిన రహస్య సమాచారం మేర సరిహద్దు గ్రామంలో పాక్ డ్రోన్ ను కూల్చివేశారు.
Southwest Monsoon : ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయోచ్
డ్రోన్ పొలంలో కూల్చిన తర్వాత అందులో పరిశీలించగా హెరాయిన్ డ్రగ్స్ ఉన్నాయి.(seizes two packets of heroin)పాక్ డ్రోన్ క్వాడ్ కాప్టర్ మోడల్ డీజే1 మాట్రిస్ 300 ఆర్టీకే సిరీస్ అని బీఎస్ఎఫ్ తెలిపింది.మరో ఘటనలో అమృతసర్ లోని ఫెన్సింగ్ వద్ద పొలంలో పూడ్చిపెట్టిన రెండు హెరాయిన్ ప్యాకెట్లను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. హెరాయిన్ ప్యాకెట్లతోపాటు ఓ అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.
BJP revisits its plans elections in five states: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి
పాక్ సరిహద్దుల్లోని భరోపాల్ గ్రామంలో పసుపు రంగు టేపులో చుట్టిన హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పాక్ సరిహద్దుల మీదుగా డ్రగ్స్ ను భారతదేశంలోకి పంపించేందుకు పాకిస్థాన్ డ్రోన్లను వాడుతోంది. ఇటీవల జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని పాక్ సరిహద్దుల్లో పలు డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చారు. పాక్ డ్రోన్లు సరిహద్దుల్లో తరచూ తిరుగుతుండటంతో బీఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు.