Shamshabad Airport Bullets: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం రేగింది. ఓ ప్రయాణికుడి నుంచి 8 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సుఖ్‌దీప్ అనే ప్రయాణికుడి నుంచి 8 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అమృత్‌సర్ వెళ్లేందుకు అతడు వచ్చాడు. అధికారులు చెక్ చేయగా బుల్లెట్స్ లభ్యమయ్యాయి. పట్టుబడ్డ నిందితుడిని పంజాబ్ వాసిగా గుర్తించారు.
బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
ప్రయాణికుడి వద్ద బుల్లెట్స్ లభ్యం కావడం ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. తోటి ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. సుఖ్ దీప్ ఎందుకు తన వెంట బుల్లెట్స్ తెచ్చుకున్నాడు? అతడికి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? వాటితో అతడికి ఏం పని? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read: నిజామాబాద్ జిల్లాపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్..! చేరికలతో కవిత సైడ్ అయిపోయినట్టేనా?