Burglar Hayath Nagar
Hayathnagar : హైదరాబాద్ శివారు పెద్దఅంబర్ పెట్, కుంట్లూరులోని ఒక గేటెడ్ కమ్యూనిటిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పెట్ కుంట్లూరు రోడ్‌లో ఉన్న ప్రజయ్ గుల్‌మొహర్ గేటెడ్ కమ్యూనిటీలో దోపిడీ దొంగలు వరుసగా నాలుగు ఇళ్లలో చోరీకి యత్నం చేసినట్లు తెలిసింది. వీరు చెడ్డీ గ్యాంగ్ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో రెక్కీ నిర్వహించి ఈ గ్యాంగ్ ఒక ఇంట్లో చోరీ చేసింది. దోపిడీ దొంగలు విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం,80 తులాల వెండి,10వేల నగదు అపహరించుకు పోయారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డవటంతో కాలనీ వాసులు హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గేటెడ్ కమ్యూనిటీలో దొంగల గ్యాంగ్ సంచరిస్తుండగా సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మూడు నాలుగు ఇళ్లలో చోరీకి ప్రయత్నించి….విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో మాత్రం బంగారం నగలు దొంగిలించారు. కాగా…చోరీ జరిగిన విషయాన్ని హయత్ నగర్ పోలీసులు బయటకు తెలియకుండా ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : Cooking Oil Price : వంటనూనెల ధరలను తగ్గించండి-కేంద్రం ఆదేశం