పల్టీలు కొడుతూ లోయలో పడ్డ బస్సు : 16 మంది మృతి

  • Published By: sreehari ,Published On : November 27, 2019 / 02:23 PM IST
పల్టీలు కొడుతూ లోయలో పడ్డ బస్సు : 16 మంది మృతి

Updated On : November 27, 2019 / 2:23 PM IST

నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడి 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అర్ఘాఖాంచీ జిల్లా మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 500 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.

సంధికాక్ నుంచి భూటాన్ వెళ్తున్న బస్సు బుధవారం (నవంబర్ 27, 2019) మధ్యాహ్నం నార్పానీ ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడింది. మూల మలుపు తిరిగే సమయంలో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నేపాల్ పోలీసులు తెలిపారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అన్నారు.

అందిన రిపోర్టుల ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 16 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా, మిగిలిన వారంతా గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Lu 2Kha 2148 అనే నెంబరు గల బస్సు లోయ రోడ్డు మార్గంలో వెళ్తుండగా 500 మీటర్ల లోతున్న లోయలో పడినట్టు డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీసు మాధవ్ రెజ్మీ తెలిపారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.