బస్సు ట్యాంకర్ ఢీ : ఇద్దరు మృతి 15 మందికి గాయాలు

  • Publish Date - February 11, 2019 / 01:42 AM IST

నల్గోండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై  సోమవారం  తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది.  విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు , ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో  ఇద్దరు మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన వారిని నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా  ఉంది.