Car Accident: రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం.. యువకుడిపై దాడికి యత్నం

అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Car Accident

Rajendranagar Car accident: : రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది.. అతివేగంగా దూసుకొచ్చిన కారు దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతాఊపిరి పీల్చుకున్నారు. రాజేంద్రనగర్ హైదర్‌గూడ‌లో కారు బీభత్సం ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఆప్టికల్ షాప్‌లోకి దూకెళ్లింది. పక్కనే ఉన్న రెండు దుకాణాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. షాప్ ముందు పార్క్ చేసిన మోటర్ సైకిల్ డామేజ్ అయింది.

Kiren Rijiju: ఆది నుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా కిరణ్ రిజిజు.. న్యాయశాఖ నుంచి ఉద్వాసనకు ప్రధాన కారణం అదే..

కారు బీభత్సం ఘటనలో తృటి‌లో పెను ప్రమాదం తప్పినట్లయింది. కారు వేగంగా దూసుకొచ్చిన సమయంలో రోడ్డు‌పై ఎవ్వరూ లేకపోవడం‌తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవ్ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమైన యువకుడిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో యువకుడు కారు వదలి పారిపోయాడు. మితిమీరిన వేగంతో కారును డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

AP Volunteers: వాలంటీర్లకు వందనం.. వరుసగా మూడో ఏడాది అవార్డులు ప్రధానం.. ప్రారంభించనున్న సీఎం జగన్

ఈ ప్రమాదానికి కారణమైన యువకుడు గురువారం ఉదయం అమెరికా నుండి హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. మితిమీరిన వేగంతో కారు నడిపి ఆక్సిడెంట్ చేశాడంటూ ప్రత్యేక సాక్షులు తెలిపారు. సీసీ టీవీ కెమెరాలో ప్రమాదంకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.