Kiren Rijiju: ఆది నుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా కిరణ్ రిజిజు.. న్యాయశాఖ నుంచి ఉద్వాసనకు ప్రధాన కారణం అదే..
కిరణ్ రిజిజూ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. కొలీజయంపై పరుష విమర్శలు చేస్తూ ప్రభుత్వానికి తలనొప్పిలా మారిన పరిస్థితులూ ఉన్నాయి.

Kiren Rijiju
Law Ministry: కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు (Kiren Rijiju)ను ఆ శాఖ నుంచి తప్పించారు. ఆయనకు భూవిజ్ఞాన శాఖ (MoES) అప్పగించారు. న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal)కు స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర సాంస్కృతిక శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగానూఉన్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే కిరణ్ రిజిజును తొలగిస్తూ ఉత్తర్వులు వెలడిన కొన్ని గంటల్లోనే న్యాయశాఖలో మరో మార్పు చోటు చేసుకుంది. న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎస్.పీ. సింగ్ భఘేల్ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా బదిలీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనల మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా మార్పులు చేశారని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) ఓ ప్రకటనలో తెలిపింది.
మూడు సార్లు ఎంపీగా..
అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా 2021 జులై నెలలో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004లో అరుణాచల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు తొలిసారి ఎన్నికయ్యారు. 2009ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొద్దికాలంకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్లీ తిరిగి 2014 లో బీజేపీలో చేరారు. 2014లో విజయం సాధించడం ద్వారా తొలిసారి మోదీ కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా చేరారు. సహాయ మంత్రిగా హోంశాఖ, క్రీడాశాఖలను కిరణ్ రిజిజు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో విజయం తరువాత.. కొద్దికాలంకు స్వతంత్ర హోదాలో మైనారిటీ వ్యవహారాలనూ చూశారు. న్యాయశాఖతో ఆయనకు కేబినెట్ హోదా లభించింది. ఈ పదవిలో ఆది నుంచి కిరణ్ రిజిజు అనే వివాదాలను ఎదుర్కొన్నారు.
Kiren Rijiju: ఆప్ రాజకీయ లాభానికి అన్నా హజారేను ఉపయోగీంచుకున్నారట.. కేంద్ర మంత్రి రిజుజు కామెంట్స్
కొలీజయం వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు ..
కిరణ్ రిజిజూ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. కొలీజయంపై పరుష విమర్శలు చేస్తూ ప్రభుత్వానికి తలనొప్పిలా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి నుంచి కొలీజియం వ్యవస్థ పారదర్శకతను రిజిజు ప్రశ్నిస్తూ వచ్చారు. రాజ్యాంగపరంగా ఈ వ్యవస్థ సరైంది కాదన్న అభిప్రాయాన్ని ఆయన పలు వేదికలపై ప్రస్తావించారు. కొంత మంది విశ్రాంతి న్యాయమూర్తులపైనా ‘భారత వ్యతిరేక ముఠా’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Cabinet reshuffle: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు శాఖ మార్పు.. మోదీ కీలక నిర్ణయం
కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు ఆమోదముద్ర వేయకుండా కేంద్రం ఆలస్యం చేయడంపై వివాదం చెలరేగినప్పుడు న్యాయవ్యవస్థపై కిరణ్ రిజిజు కాస్త తీవ్రంగా స్పందించారు. మీకుమీరే నియమించుకుంటే అంతా మీరే నడుపుకోండి.. కేంద్రంతో మీకు సంబంధం ఏమిటి అనే ఉద్దేశంతో విమర్శలు చేశారు. రిజిజు వ్యాఖ్యలపై ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ క్రమంలో న్యాయశాఖ మంత్రి పదవి నుంచి ఆయన్ను తొలగించాలని బాంబే లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుసైతం రిజిజు తీరుపట్ల అసహనం వ్యక్తం చేయడంతో న్యాయశాఖ నుంచి అతన్ని తప్పించినట్లు తెలుస్తోంది.