జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద పల్టీలు కొట్టిన కారు : తప్పిన ప్రమాదం

  • Published By: chvmurthy ,Published On : February 6, 2020 / 03:11 PM IST
జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద పల్టీలు కొట్టిన కారు : తప్పిన ప్రమాదం

Updated On : February 6, 2020 / 3:11 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సమీపంలో గురువారం రాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారు డ్రైవర్  స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీ చెక్ పోస్టువైపు వస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొనడంతో కారు పల్టీలు కొడుతూ కొంతదూరం దూసుకుపోయింది.

కారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం…కారు నడుపుతున్న వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది గమనించిన చుట్టుపక్కల ప్రజలు పల్టీలు కొట్టిన కారును ఎత్తి సరి చేశారు.  ఈ సంఘటనతో  కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు