YS Viveka Case
YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీబీఐ విచారణను స్పీడప్ చేసింది. ఈ కేసులో రెండోసారి విచారణకు హాజరయ్యారు వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి. 2 గంటలుగా రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు.
సంచలనం రేపిన వైఎస్ వివేకా కేసులో సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పలువురికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు ఆయన స్టేట్ మెంట్ తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆయనను విచారిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు.
Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్
కోఠిలోని సీబీఐ కార్యాలయంలో వైఎస్ వివేకా అల్లుడు, సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజున జరిగిన పరిణామాలు, అక్కడ సాక్ష్యాల తారుమారుకి సంబంధించిన విషయాలు, గతంలో షమీమ్ ఇచ్చిన స్టేట్ మెంట్.. వీటన్నింటి ఆధారంగా ఇదివరకే రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి ఆయన విచారణకు రావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు సునీత కూడా సీబీఐ విచారణకు హాజరైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ఆమె సీబీఐ ఆఫీసుకి వచ్చారా? లేదా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read..Ramesh Naidu: ఏపీలో సంచలన రాజకీయ మార్పులు.. జగన్ కు త్వరలో షాక్ తగలబోతోంది..