Jr Artist Rape : జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం, వీడియో చిత్రీకరణ,దోపిడి

చెన్నైలో ఇద్దరు దుండగులు ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచాం చేసి వీడియో తీసి.. ఆమె వద్ద ఉన్ననగదు దోచుకు వెళ్ళిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు

Jr Artist Rape : జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం, వీడియో చిత్రీకరణ,దోపిడి

Jr.artist Raped In Chennai

Updated On : March 11, 2022 / 3:02 PM IST

Jr Artist Rape : చెన్నైలో ఇద్దరు దుండగులు ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచాం చేసి వీడియో తీసి.. ఆమె వద్ద ఉన్ననగదు దోచుకు వెళ్ళిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

చెన్నై వలసరవాక్కంలో నివసించే జూనియర్ ఆర్టిస్ట్(38) భర్తనుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తోంది. సినిమాల్లో సహాయ నటిగా పని చేస్తోంది. మంగళవారం   మార్చి8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఎవరో ఆమె ఇంటి తలుపు కొట్టారు.

ఆమె ఇంటి తలుపు తీసి చూడగా ఇద్దరు  వ్యక్తులు కత్తులు చూపించి ఆమె ఇంటిలోకి నెట్టుకు వచ్చారు.  ఆమె మెడపై కత్తిపెట్టి ఆమె వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం, 50 వేల రూపాయల నగదు దోచుకున్నారు. అనంతరం  ఆమెపై అత్యాచారం చేశారు.  (అత్యాచారం చేస్తున్న దాన్ని వీడియో చిత్రీకరించారని కొన్ని పత్రికలు తెలిపినప్పటికీ పోలీసులు ఇచ్చిననివేదికలో ఆ అంశం ప్రస్తావించలేదు)
Also Read :Yashoda Hospital : సీఎం కేసీఆర్‌‌కు వారం పాటు విశ్రాంతి అవసరం.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
అనంతరం ఆమె వలసరవాక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  చెన్నై  రామాపురం ప్రాంతానికి చెందిన  కన్నదాసన్, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ ఈ పని చేసినట్లు గుర్తించారు.  నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ జరుగుతోంది.