Yashoda Hospital : సీఎం కేసీఆర్‌‌కు వారం పాటు విశ్రాంతి అవసరం.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వెల్లడించారు ప్రముఖ యశోదా డాక్టర్ ఎంవీ రావు. తనకు ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ చేయడం జరిగిందని...

Yashoda Hospital : సీఎం కేసీఆర్‌‌కు వారం పాటు విశ్రాంతి అవసరం.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Kcr Yashoda (1)

CM KCR Health : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వెల్లడించారు ప్రముఖ యశోదా డాక్టర్ ఎంవీ రావు. తనకు ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ చేయడం జరిగిందని, ఎడమ చేయి కొద్దిగా లాగుతోందని తెలిపారన్నారు. తాను, ఇతర వైద్యులు వెళ్లి పరీక్షలు చేయించడం జరిగిందని, ప్రతి సంవత్సరం పరీక్షలు చేయడం జరుగుతోందని తెలిపారు. అందుకే యశోదా ఆసుపత్రికి రావాలని సూచించామన్నారు. సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం యశోదా ఆసుపత్రి వైద్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

Read More : CM KCR : సీఎం కేసీఆర్ ఆల్ ఈజ్ వెల్.. పరీక్షలన్నీ నార్మల్

ఎంఆర్ఐ స్కాన్ లో కొద్దిగా సమస్య ఉందని, వయస్సుతో పాటు ఎక్కువగా వార్తా పత్రికలు, ఐప్యాడ్ వాడుతుండడం వల్ల లెఫ్ట్ ఆర్మ్ నొప్పి వచ్చిందని న్యూరోపిస్టులు నిర్ధారించారని తెలిపారు డాక్టర్ ఎంవీ రావు. అలాగే స్పాండిలైసిస్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉన్నాట్లు, మధుమేహం, బ్లడ్ ప్రెషర్ లు కంట్రోల్ ఉన్నాయన్నారు. కేసీఆర్ కు గుండె నాళాల్లో ఎలాంటి బ్లాక్స్ లేవన్నారు. 90 శాతం వరకు రిపోర్టులు వచ్చాయని, అన్నీ బాగానే ఉన్నాయన్నారు. ఈ మధ్య కాలంలో టూర్ లు, స్పీచ్ లు ఇస్తుండడంతో నీరసంగా ఉన్నారని, వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.ప్రతి వారానికొకసారి రక్త పరీక్ష, గ్లూకోజ్ స్థాయి ఎలా ఉందో చూస్తామన్నారు. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామన్నారు.

Read More : Telangana : సీఎం కేసీఆర్ హెల్త్ అప్ డేట్.. నిలకడగానే ఆరోగ్యం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో అభిమానులు, కుటుంసభ్యులు ఫుల్ టెన్షన్ కు లోనయ్యారు. యశోదా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. యాంజియోగ్రామ్ టెస్టులు చేయగా..నార్మల్ అని తేలింది. అనంతరం ఎంఆర్ఐ, సిటీ స్కాన్, రక్తం, ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టుల్లో అన్నీ నార్మల్ గా వచ్చాయని, ప్రాబ్లమ్ ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వైద్య పరీక్షలన్నీ అనంతరం 9వ ఫ్లోర్ లో ఉన్న రూమ్ లో విశ్రాంతి తీసుకున్నారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు సీఎం కేసీఆర్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉంది.