Telangana : సీఎం కేసీఆర్ హెల్త్ అప్ డేట్.. నిలకడగానే ఆరోగ్యం
వైద్యులు సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించారు. రిపోర్టు నార్మల్ గా ఉందని తెలుస్తోంది. అనంతరం MRI, సిటీ స్కాన్ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు

Kcr Health
KCR Health Update : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురి కావడం పట్ల ప్రజానీకం ఆందోళన చెందారు. ఆయనకు ఎలా ఉందో తెలుసుకోవాడానికి ప్రయత్నించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2022, మార్చి 11వ తేదీ శుక్రవారం ఉదయం సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వచ్చారు.
Read More : CM KCR: రెండ్రోజులుగా వీక్‌గా ఉన్న కేసీఆర్.. యశోదా డాక్టర్ ఎంవీ రావు ఏమన్నారంటే..
నార్మల్ పరీక్షలు చేసుకొనేందుకు ఇక్కడకు వచ్చారని సమాచారం. ఆయన వెంట సతీమణి శోభ, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారని యశోదా ఆసుపత్రి ప్రముఖ వైద్యులు ఎంవీ రావు తెలిపారు. ఎడమ చేయి, ఎడమ కాలు నొప్పిగా ఉందని కేసీఆర్ తెలిపారని వెల్లడించారు. అయితే.. ప్రతి సంవత్సరం జనరల్ పరీక్షలు చేయించుకుంటారని తెలిపారు.
Read More : CM KCR : యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్
ఇక వైద్యులు సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించారు. రిపోర్టు నార్మల్ గా ఉందని తెలుస్తోంది. అనంతరం MRI, సిటీ స్కాన్ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. అయితే.. ఈ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని సమాచారం. అవసరమైతే… ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొనేందుకు రూమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ నుంచి భోజనం తీసుకొచ్చారు. రిపోర్టులన్నీ నార్మల్ వస్తే.. డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.